E-Paper
Advertisement

YS Sharmila : షర్మిల చెప్పినట్టు చేస్తే.. ఏపీకి మంచి రోజులేనా!

YS Sharmila : షర్మిల చెప్పినట్టు చేస్తే.. ఏపీకి మంచి రోజులేనా!
Advertisement

YS Sharmila : వైఎస్ షర్మిల తగ్గేదేలే. జోరు వానలోనూ ఆమె పోరుబాట ఆగేదేలే. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కదం తొక్కారు. రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా విశాఖలో బలప్రదర్శనకు దిగారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదని తేల్చి చెప్పారు. ఏపీకి బీజేపీ శనిలా దాపురించిందని, ఒక్కొక్క ప్రాజెక్టు ఊపిరి తీస్తోందని మండిపడ్డారు. అలాంటి బీజేపీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఎందుకు మద్దతు ఇస్తు్న్నారో చెప్పాలంటూ నిలదీశారు షర్మిల.

షర్మిల క్వశ్చన్స్..

Advertisement

స్టీల్ ప్లాంట్లను అదానీ, అంబానీకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆరోపించారు. ఒకసారు ప్రైవేటీకరణ చేయమని.. మరోసారి ప్రైవేటుకరణ అంటూ.. ప్రజలను కూటమి నేతలు మోసం చేస్తున్నారని విమర్శించారు. 2 వేల మంది ఉద్యోగులను తీసేస్తే.. చంద్రబాబు, పవన్, ఏపీ బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బాబు మద్దతుతోనే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉందని.. అయినా, ఒక్క మేలైనా వీళ్లు రాష్ట్రానికి చేశారా అని నిలదీశారు. 11 వేల కోట్ల ప్యాకేజీ వలన స్టీల్ ప్లాంట్‌కు ఒరిగేది ఏమీ లేదన్నారు.

షర్మిల డిమాండ్స్

Advertisement

క్యాపిటివ్ మైన్ ఇవ్వకుండా, సెయిల్‌లో విలీనం చేయకుండా.. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై బీజేపీ కుట్ర చేస్తుందని షర్మిల తప్పుబట్టారు. 2 వేల మంది కాంట్రాక్టు కార్మికులను అక్రమంగా తొలగించారని.. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లోనే మరో 3 వేల మంది ఉద్యోగాలు తీసేస్తారని ప్రచారం జరుగుతోందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన వారికి కూడా అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు షర్మిల.

షర్మిల సొల్యూషన్స్

విశాఖ స్టీల్ ప్లాంట్ కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్టు అని గుర్తు చేశారామె. వైఎస్సార్ హయంలో స్టీల్ ప్లాంట్‌కు కష్టం వస్తే రాజశేఖర్ రెడ్డి ఆదుకున్నారని అన్నారు. ప్లాంట్‌కు ఒక క్యాప్టివ్ మైన్ ఉండాలని ఆనాడు వైఎస్ ఎంతో ప్రయత్నం చేశారని.. వైఎస్ బతికి ఉంటే క్యాపిటివ్ మైన్ వచ్చేదన్నారు షర్మిల. స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ బిడ్డగా తాను స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×