E-Paper
Advertisement

YS Sharmila Jagan : రాజారెడ్డి పెళ్లి.. జగన్ కు షర్మిల ఆహ్వానం..

YS Sharmila Jagan : రాజారెడ్డి పెళ్లి.. జగన్ కు షర్మిల ఆహ్వానం..
Advertisement

YS Sharmila Jagan : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ నివాసానికి వైఎస్‌ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల వెళ్లారు. భర్త అనిల్‌ కుమార్, కుమారుడు రాజారెడ్డి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి అన్న నివాసానికి వచ్చారు. షర్మిల ఫ్యామిలీ కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరంలో దిగింది. అక్కడి నుంచి తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటికి వెళ్లారు. తన కుమారుడు రాజారెడ్డి పెళ్లి ఆహ్వాన పత్రికను జగన్‌కు అందించారు.

షర్మిల వెళ్లిన తర్వాత మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా సీఎం నివాసానికి వెళ్లారు. షర్మిల వెళ్లిన కాసేపటికి సీఎం క్యాంపు ఆఫీస్‌కు ఆర్కే వచ్చారు. అయితే ఆర్కే వాహనాన్ని లోపలికి వెళ్లకుండా తొలుత పోలీసులు అడ్డుకున్నారు. కాసేపటి తర్వాత ఆదేశాలు రావడంతో ముఖ్యమంత్రి నివాసంలోకి ఆర్కేను అనుమతించారు.

Advertisement

గన్నవరం నుంచి వస్తున్న సమయంలో తన వాహనం ట్రాఫిక్‌లో చిక్కుకుందని ఆర్కే వెల్లడించారు. అందువల్లే షర్మిల వెంటే వెళ్లలేకపోయాయని తెలిపారు. మరోవైపు షర్మిల గురువారం కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. ఆమె ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తాను కూడా కాంగ్రెస్‌లో చేరతానని ఆర్కే ప్రకటించారు. ఆ పార్టీ విధానాల ప్రకారం నడుచుకుంటానని స్పష్టం చేశారు. జగన్‌పై ఆరోపణలు, విమర్శలు చేసే విషయంతో కాంగ్రెస్‌ ఆదేశాలను పాటిస్తానని తేల్చిచెప్పారు. షర్మిలతోపాటు ఎవరెవరు పార్టీలో చేరతారనే విషయం తనకు తెలియదని ఆర్కే అన్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×