E-Paper
Advertisement

YS Sharmila attack on CM Jagan: బాణం ఎక్కుపెట్టిన షర్మిల, జగన్‌ పార్టీకి ఓటేస్తే.. మూడు రాజధానులెక్కడ?

YS Sharmila attack on CM Jagan: బాణం ఎక్కుపెట్టిన షర్మిల, జగన్‌ పార్టీకి ఓటేస్తే.. మూడు రాజధానులెక్కడ?
Advertisement

YS Sharmila attack on CM Jagan: పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో నేతల మాటలు హద్దులు దాటుతున్నాయి. వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. తాజాగా సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల.

ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీకి ఒక్క పరిశ్రమైనా వచ్చిందా? ఓటర్లు మీరే ఆలోచించుకోవాలన్నారు వైఎస్ షర్మిల. ఓటు అన్నది మీ బిడ్డల జీవితాలకు సంబంధించిన విషయమన్నారు. బస్సు యాత్రలో భాగంగా విజయవాడలో రోడ్ షో నిర్వహించారు వైఎస్ షర్మిల. ప్రత్యేకహోదా తెస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ పార్టీ, తెచ్చిందా అంటూ ప్రశ్నంచారు. ఈ లెక్క వైసీపీకి ఎందుకు ఓటు వేయాలన్నారు. ఓటు అనేది మీ చేతిలో ఆయుధమని, జగన్‌కు ఓటు వేస్తే డ్రైనేజ్‌లో వేసినట్టేనని దుయ్యబట్టారు.

Advertisement

దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఎక్కడైనా ఉందంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమేనని అన్నారు వైఎస్ షర్మిల. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలకు రాజధానులు ఉన్నాయని, ఏపీలో మాత్రం రాజధాని ఎక్కడంటే చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు. ఒక్క రాజధాని చాలదు.. మూడు కావాలన్నారని, ఒక్కటైనా ఎక్కడుందని సూటిగా సీఎం జగన్‌పై బాణం ఎక్కుపెట్టారు.

ALSO READ: జగన్‌బాబు నీకిది తగునా, నిందితులకే రక్షణా?

Advertisement

టీడీపీ ప్రభుత్వంలో రాజధానిని నిర్మిస్తామని చెప్పారని ఎక్కడుందని ప్రశ్నించారు వైఎస్ షర్మిల.  పాలకుల మాటలు నమ్మి 33వేల ఎకరాల భూములను రైతులు ఇచ్చారని, చివరకు రాజధాని కాదు కదా రైతులంతా అన్యాయమైపోయారన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. ప్రత్యేకహోదా, పోలవరం, రాజధాని వస్తాయని వాటి కోసమైనా ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ సాధ్యమవుతున్నారు వైఎస్ షర్మిల.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×