E-Paper
Advertisement

YS Sharmila : ప్రాజెక్టులను పట్టించుకోరు.. డ్యాన్సులే వచ్చు.. అంబటిపై షర్మిల సెటైర్లు..

YS Sharmila : ప్రాజెక్టులను పట్టించుకోరు.. డ్యాన్సులే వచ్చు.. అంబటిపై షర్మిల సెటైర్లు..
Advertisement

YS Sharmila : ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీ ప్రభుత్వంపై మాటల యుద్ధాన్ని మరింత పెంచారు. నేరుగా తన అన్న, ఏపీ సీఎం జగన్ నే టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. మంత్రులపైనా ఘాటు విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై సైటర్లు వేసి ఏపీలో పొలిటికల్ హీట్ ను మరింత పెంచారు.

ప్రకాశం జిల్లా మద్దిపాడులో గండ్లకమ్మ ప్రాజెక్టును వైఎస్ షర్మిల పరిశీలించారు. షర్మిల వెంట మాజీ మంత్రి రఘువీరారెడ్డి, కొందరు కాంగ్రెస్ నేతలు ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోయాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్మించిన గండ్లకమ్మ ప్రాజెక్టును వైసీపీ సర్కార్ గాలికి వదిలేసిందని విమర్శించారు. ప్రాజెక్టు నిర్వహణకు నిధులు మంజూరు చేయలేదన్నారు.

Advertisement

ఏపీ సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితిపై షర్మిల ఫైర్ అయ్యారు. ఆ శాఖ మంత్రి అంబటి రాంబాబుపై ఘాటు విమర్శలు గుప్పించారు. అంబటికి సంక్రాంతి డ్యాన్స్‌లు చేస్తున్నారు తప్ప.. ప్రాజెక్టుల బాగోగులను చూడటం లేదని సెటైర్లు వేశారు. ఇలా షర్మిల సీఎం జగన్ తో పాటు మంత్రులు టార్గెట్ చేస్తూ మాటల దాడిని పెంచారు.

జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై సోషల్ మీడియాలో అనేక ట్రోల్స్ నడుస్తూ ఉంటాయి. గతంలో పోలవరం ప్రాజెక్టుపై ప్రంజేటేషన్ ఇచ్చి అబాసుపాలయ్యారు. కానీ 2023 సంక్రాంతికి ఆయన డ్యాన్సులు వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ సినిమా బ్రో సినిమాలో సంబరాల రాంబాబు క్యారెక్టర్ ను పెట్టారు.

Advertisement

తనను ఉద్దేశించే ఈ పాత్రను పెట్టారని అప్పట్లో అంబటి రాంబాబు రచ్చ చేశారు. తాజాగా సంక్రాంతి వేడుకలో అంబటి రాంబాబు వేసిన స్టెప్స్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యింది. ఇలా ఆయన డ్యాన్సులపైనే శ్రద్ధ పెడుతున్నారు కానీ.. ఏపీలోని సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టడంలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో అంబటి డ్యాన్సులపై షర్మిల కామెంట్స్ చేయడంపై హాట్ టాపిక్ గా మారింది.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×