E-Paper
Advertisement

YS Jagan: లోక్‌భవన్‌కు వైఎస్ జగన్.. గవర్నర్‌తో సమావేశం, ఎందుకంటే..?

YS Jagan: లోక్‌భవన్‌కు వైఎస్ జగన్.. గవర్నర్‌తో సమావేశం, ఎందుకంటే..?
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నేడు కీలక ఘట్టానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని లోక్ భవన్ పరిసరాల్లో భారీ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను గవర్నర్‌కు సమర్పించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునివ్వడంతో.. రాష్ట్రం నలుమూలల నుండి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, నాయకులు విజయవాడకు తరలివచ్చారు. కార్యకర్తల తాకిడి పెరగడంతో పోలీసులు లోక్ భవన్ పరిసరాల్లో ముందస్తుగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. బారికేడ్లు నిర్మించి, అదనపు బలగాలను రంగంలోకి దించారు. లోక్ భవన్ వైపు వచ్చే రహదారులన్నీ జనసంద్రంగా మారాయి.

Advertisement

వైసీపీ శ్రేణుల నిరసనల మధ్య వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుందని.. సామాన్యులకు వైద్య సేవలు భారం అవుతాయని ఆయన గవర్నర్‌కు వివరించారు. ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాల ప్రతులను ఈ సందర్భంగా గవర్నర్‌కు అందజేసి, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని వైసీపీ నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలను నియంత్రించడం పోలీసులకు సవాలుగా మారింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లోక్ భవన్ ప్రాంతంలో ఆంక్షలు కఠినతరం చేశారు.

Advertisement

ALSO READ: Ibomma Ravi: తీగ లాగితే డొంక కదిలింది, ఐ బొమ్మ రవి కేసులో దిమ్మతిరిగే నిజాలు

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×