E-Paper
Advertisement

YS Jagan: పొగాకు రైతులకు జగన్ భరోసా.. త్వరలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటన!

YS Jagan: పొగాకు రైతులకు జగన్ భరోసా.. త్వరలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటన!
Advertisement

YS Jagan: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పొగాకు రైతులతో సమావేశమై వారి సమస్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ధరల సంక్షోభం, చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై ఆయన ఘాటుగా స్పందించారు. రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటన

Advertisement

ధరలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు వచ్చే వారం లేదా పది రోజుల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని గోపాలపురం లేదా జంగారెడ్డిగూడెంలో పర్యటిస్తానని జగన్ ప్రకటించారు. అక్కడ క్షేత్రస్థాయిలో రైతులను కలిసి, సమస్యలు తెలుసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వంలో చలనం రాకపోతే కందుకూరులో పర్యటించి, రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని తెలిపారు. నిద్రపోతున్న ప్రభుత్వాన్ని లేపడం సులభమే కానీ, నిద్ర నటిస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని లేపాలంటే గట్టిగా నిరసన తెలపక తప్పదని పేర్కొన్నారు.

ప్రభుత్వంపై విమర్శలు..

Advertisement

పొగాకు వేలం ప్రారంభమై 94 రోజులు గడిచినా కేవలం 16.5 శాతం మాత్రమే కొనుగోలు చేయడం ప్రభుత్వ ఘోర వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. సాధారణంగా 100 రోజుల్లో పూర్తవ్వాల్సిన ప్రక్రియ ఇంత నెమ్మదిగా సాగడం వల్ల సెప్టెంబరులో కర్ణాటక వేలం మొదలైతే ఇక్కడి పంటను ఎవరు కొంటారనే భయం రైతుల్లో నెలకొంది. రూ.200 కంటే ధర తగ్గకూడదని సీఎం సమీక్షించిన మరుసటి రోజే పొదిలి, కనిగిరి, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో రూ.130 నుంచి రూ.186 వరకు ధరలు పడిపోయాయి. వ్యాపారులు సిండికేట్‌గా మారి నో-బిడ్లు పెట్టడం, బేళ్లను తిరస్కరిస్తున్నా ప్రభుత్వం కనీసం కేసులు పెట్టకుండా, లైసెన్సులు రద్దు చేయకుండా ప్రేక్షకపాత్ర వహిస్తోందని మండిపడ్డారు.

Also Read: మోడీకి రాజ్యాంగం తెలీదు.. అమిత్ షా రాజ్యాంగం నడుస్తోంది! చింతా మోహన్ సంచలన కామెంట్స్

వైఎస్సార్‌సీపీ పాలనలో రైతు సంక్షేమం

తమ ప్రభుత్వ హయాంలో దేశంలోనే తొలిసారిగా మార్క్‌ఫెడ్‌ను పొగాకు వేలం వేదికపైకి తెచ్చామని జగన్ గుర్తుచేశారు. దీనివల్ల వ్యాపారుల సిండికేట్ విచ్ఛిన్నమై నిజమైన పోటీ ఏర్పడిందని, ధరలు పెరిగాయని చెప్పారు. రూ.3,000 కోట్లతో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు చేసి, ఐదేళ్లలో పంటల కొనుగోళ్లకు రూ.7,800 కోట్లు ఖర్చు చేశామన్నారు. ప్రతి ఆర్బీకేను ధరల పర్యవేక్షణ కేంద్రంగా మార్చి, సీఎం యాప్ ద్వారా జాయింట్ కలెక్టర్ల పర్యవేక్షణలో గిట్టుబాటు ధర దక్కేలా చూశామని వివరించారు.

వెంటనే మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి, రైతులకు నష్టం రాకుండా సరైన ధరతో పొగాకు కొనుగోలు చేయాలని జగన్ డిమాండ్ చేశారు. రైతుల ముఖంలో చిరునవ్వు ఉండే వరకు YSRCP పోరాటం ఆపదని స్పష్టం చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×