E-Paper
Advertisement

YS Jagan: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. దేశంలోనే అతి పెద్ద స్కాం: వైఎస్ జగన్

YS Jagan: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. దేశంలోనే అతి పెద్ద స్కాం: వైఎస్ జగన్
Advertisement

YS Jagan: ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో దేశంలోనే అతి పెద్ద స్కాం జరుగుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల సేకరణ చేపట్టింది. ఈ ప్రతులను గురువారం విజయవాడ లోక్‌భవన్‌లో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు అందించారు వైఎస్ జగన్. అనంతరం లోక్‌భవన్‌ వద్ద వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు.

మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం

సీఎం చంద్రబాబు మెడికల్ కాలేజీల స్కాంను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లామని వైఎస్ జగన్ తెలిపారు. పీపీపీ పేరుతో మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆరోపించారు. పీపీపీ వల్ల జరిగే నష్టాల్ని గవర్నర్‌కు వివరించామన్నారు. ప్రభుత్వం బాధ్యతగా లేకపోతే ప్రజలు ఎలా జీవించగలరని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆధీనంలో విద్య, వైద్య ఉండాలన్నారు. ఈ వ్యవస్థల్ని ప్రైవేట్‌ పరం చేస్తే ప్రభుత్వం ఇంకెందుకని ప్రశ్నించారు.

పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఏది?

Advertisement

గత వైసీపీ ప్రభుత్వం ఒక విజన్‌తో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్‌ కాలేజీలు నిర్మించిందని వైఎస్ జగన్ తెలిపారు. అన్నీ సర్వీసులు ఉండేలా మెడికల్‌ కాలేజీలను తీసుకొచ్చామ్నారు. పేదలకు ఉచితంగా సూపర్‌, మల్టీ స్పెషాలిటీ సేవలు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటుచేశామన్నారు. పేదవాడి ఆరోగ్యానికి భరోసాగా ఉండాల్సిన మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తు్న్నారని మండిపడ్డారు.

Also Read: Kalisetti Appalanaidu: జగన్ సంతకాల సేకరణ ఓ సినిమా సెట్టింగ్.. పులివెందులలోనే పరువు పోయింది: ఎంపీ అప్పలనాయుడు ఫైర్

దేశ చరిత్రలో అతిపెద్ద స్కాం

Advertisement

మెడికల్‌ కాలేజీలను పీపీపీ విధానం.. మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అని జగన్ అన్నారు. ప్రైవేట్ వాళ్లకు మెడికల్ కాలేజీలు కట్టబెట్టడమే ఈ స్కామ్ అని ఆరోపించారు. ప్రైవేట్ కాలేజీల్లో ప్రభుత్వమే జీతాలు ఇవ్వడం మరో స్కాం అన్నారు. రూ.120 కోట్ల ప్రజాధనాన్ని జీతాల కింద ప్రైవేట్ వాళ్లకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఇంతకన్నా పెద్ద స్కాం ఉండదని వైఎస్ జగన్ అన్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×