// // YS Jagan: ఎవరినీ వదలనంటూ.. చంద్రబాబుకు జగన్ వార్నింగ్! -->
E-Paper
Advertisement

YS Jagan: అంబటి ఫ్యామిలీకి జగన్ పరామర్శ.. ఎవరినీ వదలనంటూ.. చంద్రబాబుకు మాస్ వార్నింగ్!

YS Jagan: అంబటి ఫ్యామిలీకి జగన్ పరామర్శ.. ఎవరినీ వదలనంటూ.. చంద్రబాబుకు మాస్ వార్నింగ్!
Advertisement

YS Jagan: సీఎం చంద్రబాబు (CM Chandrababu) ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైసీపీ అధినేత జగన్ (YS Jagan) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఆటవిక పాలన (జంగిల్ రాజ్యం) సాగుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు (Ambati Rambabu Arrest) నేపథ్యంలో గుంటూరులో ఆయన కుటుంబాన్ని పరామర్శించిన జగన్.. తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజినీ, బొల్లా బ్రహ్మనాయుడు వంటి వైసీపీ నేతలపై దాడులు అత్యంత హేయమని దుయ్యబట్టారు.

‘తిరుమల లడ్డుపై తప్పుడు ప్రచారం’

అంబటి రాంబాబు, భూమన, కాకాణిలు చేసిన తప్పేంటని జగన్ నిలదీశారు. ప్రశ్నిస్తున్నారన్న అక్కసుతోనే తమ వాళ్లపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. తిరుమల నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని కుట్రపూరితంగా చంద్రబాబు అండ్ కో ప్రచారం చేశారని జగన్ మండిపడ్డారు. ఆవు, పంది, చేప కొవ్వు అంటూ ఉద్దేశపూర్వకంగా దేవుడి ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేశారన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు దేవుడంటే భయం, భక్తి లేవన్నారు. తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో ఎళాంటి జంతువుల కొవ్వు లేవని కేంద్రం ల్యాబ్ లు రిపోర్టులు ఇచ్చాయని, అదే విషయాన్ని పేర్కొంటూ సుప్రీంకోర్టులో సీబీఐ చార్జి షీట్ సైతం వేసిందని జగన్ అన్నారు.

‘అంబటిపై టీడీపీ గూండాలు దాడి’

Advertisement

చంద్రబాబు, పవన్, లోకేష్ తాము చేసిన తప్పుడు ఆరోపణలకు లెంపలేసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. సీబీఐ స్పష్టం చేసినా మళ్లీ మళ్లీ అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ఫ్లెక్సీలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చంద్రబాబును ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారని.. గుడికి వెళ్లిన అంబటిని టీడీపీ గుండాలు కర్రలు, రాడ్లతో పోలీసుల సమక్షంలో అడ్డగించారని జగన్ గుర్తుచేశారు. అంబటిని పచ్చి బూతులు తిడుతూ ఆయన కారుపై దాడికి తెగబడ్డారన్నారు. టీడీపీ గుండాలు దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారన్నారు.

Also Read: Revanth Reddy: రైతులకు రేవంత్ రెడ్డి భరోసా.. ఎన్నికల తర్వాత రూ.9 వేల కోట్లు విడుదల..!

‘వచ్చేది మేమే.. వదిలిపెట్టం’

Advertisement

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో తప్పు జరిగి ఉంటే వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి పేర్లను చార్జ్ షీట్ లో సీబీఐ ఎందుకు చేర్చలేదని జగన్ నిలదీశారు. అసలు సీబీఐ విచారణ కావాలని సుప్రీంకోర్టును కోరిందే వైవీ సుబ్బారెడ్డి అని గుర్తుచేశారు. తిరుమల లడ్డూపై చేసిన తప్పుడు ప్రచారానికి చంద్రబాబు, పవన్, లోకేష్ క్షమాపణలు చెప్పకపోగా.. ప్లెక్సీలు పెట్టి మరీ తమ నేతలను రెచ్చగొడతారా? అంటూ జగన్ ప్రశ్నించారు. కుల మతాలను రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు పెట్టడం రాజ్యాంగ విరుద్దం కాదా? అంటూ నిలదీశారు. అంబటిని జైలులో ఉంచి సీఐ, ఎస్ఐలు భౌతికంగా ఇబ్బంది పెట్టారని.. మరో మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమేనని జగన్ అన్నారు. వచ్చిన తర్వాత ఎక్కడున్నా తీసుకొచ్చి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వడ్డీతో సహా తిరిగిస్తామని వార్నింగ్ ఇచ్చారు.

Also Read: KTR: ముఖ్యమంత్రిపై సీబీఐ, ఈడీ విచారణకు సుప్రీం ఆదేశాలు.. అందుకే మాపై కక్షసాధింపులు: కేటీఆర్ ధ్వజం

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×