E-Paper
Advertisement

YSRCP అధికారిక ఫేస్‌బుక్ పేజీ తొలగింపు.. చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం!

YSRCP అధికారిక ఫేస్‌బుక్ పేజీ తొలగింపు.. చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం!
Advertisement

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సెగలు సోషల్ మీడియా వేదికగా మరోసారి రాజుకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధికారిక ఫేస్‌బుక్ పేజీ హఠాత్తుగా అందుబాటులో లేకపోవడంపై ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే కక్షపూరితంగా తమ సోషల్ మీడియా ఖాతాలను తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.

ప్రజాస్వామ్య విలువలపై దాడి

Advertisement

ప్రభుత్వం ప్రజల, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని వైఎస్ జగన్ విమర్శించారు. ‘ఈ ఏడాది ప్రారంభంలోనే మా అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను తొలగించారు, ఇప్పుడు ఫేస్‌బుక్ పేజీని కూడా అందుబాటులో లేకుండా చేశారు. ఇది కేవలం వైఎస్సార్‌సీపీపై జరిగిన దాడి కాదు, ప్రజాస్వామ్య విలువలు, భావ ప్రకటనా స్వేచ్ఛపై జరిగిన దాడి’ అని ఆయన పేర్కొన్నారు. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడం తమ విధి అని, నిజాలు మాట్లాడుతున్నందుకే ప్రభుత్వం భయపడుతోందని అన్నారు.

అవినీతిని ప్రశ్నించినందుకేనా?

Advertisement

రాజధాని పేరుతో జరుగుతున్న దుబారా ఖర్చులు, డీఎస్‌సీ ప్రక్రియలో చోటుచేసుకున్న అవకతవకలు, అలాగే టీటీడీ నెయ్యి టెండర్లలో జరిగిన అవినీతి అక్రమాలను తాము సాక్ష్యాలతో సహా ప్రజల ముందుంచామని జగన్ గుర్తుచేశారు. ఈ నిజాలు బయటపడటంతో తట్టుకోలేకే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తమ ఖాతాలను నిలిపివేయించిందని ఆరోపించారు. సత్యం మాట్లాడే ప్రతిపక్షం గొంతు నులిమేయడం ప్రమాదకరమైన, అత్యంత అప్రజాస్వామికమైన చర్య అని ఆయన హెచ్చరించారు.

న్యాయపోరాటానికి సిద్ధం

ఇలాంటి బెదిరింపులకు, అణచివేత చర్యలకు తాము భయపడే ప్రసక్తే లేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇప్పటికైనా తమ పార్టీ అధికారిక సోషల్ మీడియా పేజీలను పునరుద్ధరించాలని, లేనిపక్షంలో ఈ అప్రజాస్వామిక చర్యపై న్యాయపోరాటం చేస్తామని జగన్ హెచ్చరించారు.

Also Read: అవసరమైతే నేనూ రోడ్డు మీదికి వస్తా.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×