E-Paper
Advertisement

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!
Advertisement

YS Jagan: భీమవరం వేదికగా వైసీపీ అభిమానుల గుండెల్లో ఒక్కసారిగా ఆందోళన రేపిన సంఘటన ఇది. ఆక్వా రైతులతో ముఖాముఖి మాట్లాడటానికి వేదికపైకి వచ్చిన పార్టీ అధినేత వైఎస్ జగన్‌ను చూడగానే అక్కడ ఉన్న జనం ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. తమ ప్రియతమ నేతను ఎలాగైనా దగ్గరగా చూడాలని, ఒక్క సెల్ఫీ దిగాలని, కనీసం ఒక్కసారైనా షేక్ హ్యాండ్ ఇవ్వాలనే ఆరాటంతో అభిమానులు బారికేడ్లను సైతం లెక్కచేయకుండా దూసుకువచ్చారు.

అయితే, ఆ అమితమైన అభిమానమే అక్కడ ఊహించని ప్రమాదకర పరిస్థితికి దారితీసింది. వేలాదిగా తరలివచ్చిన ఫ్యాన్స్ ఒక్కసారిగా వేదికపైకి ఎగబడటంతో అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ఆ తోపులాటలో కొందరు జగన్ కాలు పట్టుకుని లాగగా, వెనుక ఉన్న జనం ముందుకు తోశారు. దీంతో ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయిన వైఎస్ జగన్ వేదికపైనే కిందపడిపోయారు.

Advertisement

ఆయన కిందపడుతున్న క్షణంలో అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించారు. క్షణాల వ్యవధిలో ఆయన్ని పట్టుకుని పైకి లేపారు. ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటనతో అక్కడ ఉన్నవారంతా షాక్‌కు గురయ్యారు. అయితే, లక్కీగా ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో వైసీపీ శ్రేణులు, అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. అభిమానం ఉండటం మంచిదే అయినా, అది ఇలాంటి ప్రమాదకర పరిస్థితులకు దారితీయకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×