E-Paper
Advertisement

YS Jagan Mohan Reddy: చెన్నైలో జగన్ సందడి.. వివాహ వేడుకలో సూర్య, కార్తీలతో..!

YS Jagan Mohan Reddy: చెన్నైలో జగన్ సందడి.. వివాహ వేడుకలో సూర్య, కార్తీలతో..!
Advertisement

YS Jagan Mohan Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెన్నై నగరంలో ప‌ర్య‌టించారు. తన సమీప బంధువుల వివాహ వేడుకలో పాల్గొన్నారు. చెన్నై చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు..

వైఎస్ జగన్ పెదనాన్న వైఎస్ జార్జి రెడ్డి కుమారుడు వైఎస్ అనిల్ రెడ్డి నివాసంలో ఈ వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. అనిల్ రెడ్డి కుమారుడు సాహిల్, వేదికల కళ్యాణ ఘట్టాన్ని చూడటానికి జగన్ స్వయంగా తరలివచ్చారు. ఈ వేడుకలో ఏపీ మాజీ సీఎం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన్ని చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తల కోలాహలంతో ఆ ప్రాంతం సందడిగా మారింది. కుటుంబ సభ్యులతో కలిసి జగన్ ఈ వేడుకను ఆస్వాదించారు.

Advertisement

ఈ వివాహ వేడుకకు కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తీ హాజరుకావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాంప్రదాయ పట్టు పంచె, షర్ట్ ధరించి వచ్చిన సూర్యను చూడగానే జగన్ సాదరంగా ఆహ్వానించారు. సూర్య తన తమ్ముడు కార్తీని జగన్‌కు పరిచయం చేయగా, జగన్ వారిద్దరినీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. జగన్, సూర్యల మధ్య పాత స్నేహం ఉండటంతో వారిద్దరూ పక్కపక్కనే కూర్చుని సరదాగా ముచ్చటించారు. ఈ స్టార్ బ్రదర్స్ మరియు అగ్ర నాయకుడి కలయిక చూసి అక్కడి వారు ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

అంతేకాకుండా, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కూడా ఈ వేడుకలో సందడి చేశారు. ఒకే వేదికపై వైఎస్ జగన్, మోహన్ బాబు పక్కపక్కనే ఉన్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రాజకీయాల్లో కీలక నేత, సినీ రంగంలో అగ్ర నటుడు ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సినీ అభిమానుల్లోనూ ఆసక్తికర చర్చ మొదలైంది.

Read Also: Parvathipuram Manyam: ఆంధ్రప్రదేశ్‌లో షాకింగ్ ఘటన.. విద్యాసంస్థలో అశ్లీల డాన్సుల కలకలం!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×