E-Paper
Advertisement

Avinash Reddy : నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్న అవినాష్‌రెడ్డి.. ఈసారి అరెస్ట్ తప్పదా..?

Avinash Reddy : నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్న అవినాష్‌రెడ్డి.. ఈసారి అరెస్ట్ తప్పదా..?
Advertisement

Avinash Reddy : వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో నేడు కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి శుక్రవారం మరోసారి సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. హైదరాబాద్‌లోని తమ కార్యాలయానికి రావాలని ఇప్పటికే సీబీఐ నోటీసులు ఇచ్చింది.

ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను వెకేషన్‌ బెంచ్‌కి ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ విచారణ తేదీ ఖరారులేదు. దీంతో అవినాష్‌రెడ్డికి దారులు మూసుకుపోయాయని న్యాయనిపుణులు అంటున్నారు.

Advertisement

సీబీఐ విచారణకు పిలిచిన ప్రతిసారీ అవినాష్‌రెడ్డి కోర్టులో పిటిషన్‌ వేస్తున్నారని, గడువు కోరుతూ విచారణను జాప్యం చేస్తున్నారని వివేకా కుమార్తె సునీతారెడ్డి న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని సహ నిందితుడిగా కోర్టుకు సమర్పించిన నివేదికలో సీబీఐ పేర్కొంది. మరోవైపు అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పులివెందుల నుంచి హైదరాబాద్‌కు ఎంపీ అనుచరులు భారీగా తరలివచ్చారు. మొత్తం మీద శుక్రవారం కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని సీబీఐ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీచేసింది. అయితే తనకు ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయని ఆ రోజు అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కాలేదు. పులివెందులకు వెళ్లిపోయారు. విచారణకు హాజరయ్యేందుకు 4 రోజుల గడువు కావాలని సీబీఐకి లేఖ రాశారు. అదే రోజు సీబీఐ మరోసారి అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19న తప్పకుండా విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. జూన్ 30 లోపు వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. ఈ నేపథ్యంలోనే సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×