E-Paper
Advertisement

Chandrababu: షాకింగ్..సీఎం చంద్ర‌బాబుపై వైసీపీ సోష‌ల్ మీడియా ప్ర‌శంస‌లు.!

Chandrababu: షాకింగ్..సీఎం చంద్ర‌బాబుపై వైసీపీ సోష‌ల్ మీడియా ప్ర‌శంస‌లు.!
Advertisement

సీఎం చంద్రబాబుపై తరచూ విమర్శలు చేసే ప్రతిపక్ష పార్టీ వైసీపీ సోషల్ మీడియా తాజాగా ప్రశంసలు కురిపిస్తోంది. థాంక్యూ చంద్రబాబు అంటూ వైసీపీ శ్రేణులు వరుస పోస్టులు పెడుతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అయితే బాబుపై వైసీపీ మీడియా ప్రశంసలు కురిపించడానికి ఓ కారణం కూడా ఉంది. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నో హంగులతో రుషికొండ ప్యాలెస్ నిర్మించిన సంగతి తెలిసిందే. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విలాసవంతంగా ఉండేందుకు, తన సతీమణి కోసమే కొండను తవ్వి మరీ రుషికొండ ప్యాలెస్ నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి.

కానీ ఏపీలో ప్రభుత్వం మారి టీడీపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు ప్రభుత్వంపై ఆ ప్యాలెన్ ను ఏం చేయాలనే ఆలోచనలో పడింది. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు శనివారం పార్టీ నేతలు, కొందరు అధికారులతో కలిసి రుషికొండ ప్యాలెస్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రుషికొండ ప్యాలెస్ ను వరల్డ్ క్లాస్‌లో నిర్మించారని అన్నారు. ఇదే పాయింట్ పట్టుకుని వైసీపీ సోషల్ మీడియా చంద్రబాబు ప్యాలెస్ నిర్మాణాన్ని ప్రశంసించారని, జగన్ పనితీరును మెచ్చుకున్నారని థాంక్యూ చెబుతోంది. కానీ చంద్రబాబు స్పీచ్ మొత్తం అందుకు విరుద్దంగానే ఉంది.

Advertisement

ప్యాలెస్ నిర్మాణంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రపంచంలో చాలా దేశాలు తిరిగినా ఎక్కడా ఇలాంటి కాస్ట్లీ ప్యాలెస్ చూడలేదని చెప్పారు. ఎవరూ కలలో కూడా ఊహించనిదని, ఒక వ్యక్తి తన విలాసవంతమైన జీవితం కోసం ఏ విధంగా కార్యక్రమాలు చేస్తాడనేది ఇక్కడి భవనాలు చూసిన తరవాతనే తెలిసిందన్నారు. కేవలం బాత్ టబ్ కోసమే రూ.36 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేశార‌ని చెప్పారు. ఫ్యాన్సీ ఫ్యాన్లు పెట్టార‌ని ఇలాంటి షాండియ‌ర్లు తాను ఎక్క‌డా చూడ‌లేద‌ని అన్నారు. ఈ భ‌వనాలు అంద‌రికీ చూపిస్తామ‌ని, వీటిని వేటికి వాడుకోవాలో అర్థం కావ‌డం లేదని అన్నారు. పేద‌ల‌ను ఆదుకుంటామ‌నేవారు ఇలాంటివి క‌ట్టుకుంటారా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×