E-Paper
Advertisement

YCP Rebel MLAs: స్పీకర్ విచారణకు ఇప్పుడే రాలేం.. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు డుమ్మా..

YCP Rebel MLAs: స్పీకర్ విచారణకు ఇప్పుడే రాలేం.. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు డుమ్మా..
Advertisement

YCP Rebel MLAs News: ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు తన వద్ద విచారణకు గురువారం రావాలి కోరారు. కానీ తాము రాలేమని ఆ నలుగురు ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి స్పష్టం చేశారు.

తమకు వ్యతిరేకంగా ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు సమర్పించిన ఆధారాలు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం చెల్లవని ఆ నలుగురు ఎమ్మెల్యేలు రిప్లై ఇచ్చారు. ప్రసాదరాజు సమర్పించిన వీడియోలు, ఫోటోలు ఒరిజినల్ అని ఆయా సంస్థలు నుంచి.. సర్టిఫైడ్ కాపీలను ఇవ్వాలని స్పీకర్ కు లేఖ రాశారు.

Advertisement

వాస్తవానికి గురువాం మధ్యాహ్నం 3 గంటలకు మేకపాటి, కోటంరెడ్డి, ఆనం, శ్రీదేవి మౌఖికంగా తన ఎదుట హాజరు కావాలని స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఇక టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్ పై స్పీకర్ నిర్ణయానికే వదిలేశారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని వెల్లడించారు.

స్పీకర్‌ తమ్మినేని సీతారాం టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యేలను మూడోసారి విచారణకు పిలిచారు. గురువారం తన ఎదుట విచారణకు హాజరు కావాలని టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు.

Advertisement

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేలు మద్ధాలి గిరిధరను స్పీకర్ విచారణకు హాజరుకావాలని కోరారు. ఈ నలుగు ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో చేరారు. దీంతో టీడీపీ వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే నలుగురు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు.

అటు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు, ఇటు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు స్పీకర్ వద్ద ఉన్నాయి. మరి సభాపతి తమ్మినేని సీతారాం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×