E-Paper
Advertisement

YCP on Borugadda Anil: బోరుగడ్డకు షాకిచ్చిన వైసీపీ

YCP on Borugadda Anil: బోరుగడ్డకు షాకిచ్చిన వైసీపీ
Advertisement

బోరుగడ్డ అనిల్ కుమార్‌కు.. వైసీపీ షాక్ ఇచ్చింది.  అనిల్ కుమార్‌ గత కొన్ని నెలలుగా వైసీపీ నేతగా ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వెలువడ్డాయి. ముఖ్యంగా ఆయన పలుమార్లు జైలుకు వెళ్లిన సందర్భాల్లో కూడా “జగన్ తనకు అండగా ఉన్నారు” అని అనిల్ ప్రకటించారు. దీంతో  స్థానికంగా ఆయన వైసీపీ నాయకుడే అనే అభిప్రాయం బలపడింది. దీనితో పార్టీపై విమర్శలు కూడా వచ్చాయి.

అయితే తాజాగా వైసీపీ అధికారికంగా స్పందిస్తూ, అనిల్ కుమార్‌కు పార్టీతో ఎలాంటి సంబంధం లేదని.. ఆయన చేస్తున్న అరాచకాలకు పార్టీకి ఎటువంటి బాధ్యత లేదని స్పష్టం చేసింది. అనిల్‌ను వైసీపీ నాయకుడిగా ప్రచారం చేయడం పూర్తిగా అవాస్తవమని కొంతమంది వ్యక్తులు కావాలనే పార్టీ పేరును దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించింది.

Advertisement

ఈ ప్రకటనతో స్థానిక రాజకీయాల్లో కొత్త చర్చలు మొదలయ్యాయి. పార్టీ ఇంత స్పష్టమైన ఖండన చేయడంతో అనిల్ కుమార్ ఎలా స్పందిస్తారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. గతంలో తరచూ వైసీపీకి సమీపంగా ఉన్నట్టు చెప్పుకున్న ఆయన ఇప్పుడు ఏ విధమైన ప్రకటన చేస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది.

Advertisement

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×