E-Paper
Advertisement

Ycp leader Goutham Reddy: ప‌రారీలో వైసీపీ నేత గౌత‌మ్ రెడ్డి.. ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్న‌ అరాచకాలు

Ycp leader Goutham Reddy: ప‌రారీలో వైసీపీ నేత గౌత‌మ్ రెడ్డి.. ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్న‌ అరాచకాలు
Advertisement

Ycp leader Goutham Reddy:  విజ‌య‌వాడ‌లో భూక‌బ్జా వ్య‌వ‌హారంలో వైసీపీ నేత గౌతమ్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఉమామ‌హేశ్వ‌రరావు అనే వ్య‌క్తి త‌న‌కు చెందిన స్థ‌లాన్ని గౌత‌మ్ రెడ్డి క‌బ్జా చేసి బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని ఆరోపించాడు. బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్న వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ క్ర‌మంలో వీడియోలు బ‌య‌ట‌కు రావ‌డం వ‌ల్ల త‌న ప‌రువు పోతుంద‌ని ఉమా మ‌హేశ్వ‌ర‌రావుపై గౌతమ్ రెడ్డి సుపారీ గ్యాంగ్ కు డ‌బ్బులు ఇచ్చి దాడి చేయించాడు. రూ.24 ల‌క్ష‌లు సుపారీ గ్యాంగ్ కు ఇచ్చి య‌జ‌మాని కాళ్లు చేతులు విరిచేయాల‌ని చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

దీంతో ఉమామ‌హేశ్వ‌ర రావు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న కోసం పోలీసులు గాలిస్తుండగా ప‌రారీలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో గౌత‌మ్ రెడ్డి గురించి మీడియా స‌మావేశంలో సీపీ సంచ‌లన నిజాలు బ‌య‌ట‌పెట్టారు. గౌత‌మ్ రెడ్డిపై గ‌తంలోనే 42 కేసులు ఉన్న‌ట్టు తెలిపారు. 1998 నుండి గౌత‌మ్ రెడ్డి భూక‌బ్జాల‌కు పాల్ప‌డ‌టం, ఇత‌ర దందాలు చేస్తున్న‌ట్టు చెప్పారు. ఇప్ప‌టికే ఆయ‌నపై రౌడీ షీట్ కూడా న‌మోదు చేసిన‌ట్టు వెల్ల‌డించారు.

Advertisement

దీపావ‌ళి పండుగ రోజున ఉమామ‌హేశ్వ‌ర రావు ఇంటిపైకి గౌత‌మ్ రెడ్డి మ‌నుషుల‌ను పంపించిన‌ట్టు చెప్పారు. కేసుల‌ను వెన‌క్కి తీసుకోక‌పోతే చంపేస్తామ‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డిన‌ట్టు తెలిపారు. ప్ర‌స్తుతం గౌత‌మ్ రెడ్డి ప‌రారీలో ఉన్నార‌ని ఆయ‌న కోసం రెండు బృంధాలు గాలిస్తున్నాయ‌ని అన్నారు. గౌత‌మ్ రెడ్డి సుపారీ ఇచ్చిన గ్యాంగ్ స‌భ్యులు న‌లుగురిని అదుపులోకి తీసుకున్నామ‌ని చెప్పారు. గౌత‌మ్ రెడ్డి గ్యాంగ్ కు సుపారీ ఇచ్చిన‌ట్టు వీడియో రికార్డు అయింద‌ని ఆ వీడియో ఆధారంగా విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని చెప్పారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×