E-Paper
Advertisement

YCP Fourth List : వైసీపీ నాలుగో జాబితా విడుదల.. 9 మంది అభ్యర్థులు వీరే..?

YCP Fourth List : వైనాట్ 175 అంటూ ఏపీ సీఎం జగన్ రేసు గుర్రాల జాబితాలను విడతల వారీగా విడుదల చేస్తున్నారు. సుదీర్ఘ కసరత్తు తరువాత 9 మందితో నాలుగో జాబితా రిలీజ్ చేశారు. ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు.. ఒక లోక్‌సభ స్థానానికి ఇంచార్జులను బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అయితే.. గతంలోలాగే.. ఫోర్త్ లిస్ట్ లో పెద్ద ఎత్తున మార్పులు చేశారు. 9 మందితో విడుదలైన నాలుగో జాబితాలో ఐదుగురు సిట్టింగులకు టికెట్ దక్కలేదు.

YCP Fourth List : వైసీపీ నాలుగో జాబితా విడుదల.. 9 మంది అభ్యర్థులు వీరే..?
Advertisement
AP news today telugu

YCP Fourth List(AP news today telugu):

వైనాట్ 175 అంటూ ఏపీ సీఎం జగన్ రేసు గుర్రాల జాబితాలను విడతల వారీగా విడుదల చేస్తున్నారు. సుదీర్ఘ కసరత్తు తరువాత 9 మందితో నాలుగో జాబితా రిలీజ్ చేశారు. ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు.. ఒక లోక్‌సభ స్థానానికి ఇంచార్జులను బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అయితే.. గతంలోలాగే.. ఫోర్త్ లిస్ట్ లో పెద్ద ఎత్తున మార్పులు చేశారు. 9 మందితో విడుదలైన నాలుగో జాబితాలో ఐదుగురు సిట్టింగులకు టికెట్ దక్కలేదు.

Advertisement

శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి, కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్, మడకశిర ఎమ్మెల్యే మోపురగుండు తిప్పేస్వామికి ఈ సారి మొండిచేయే మిగిలింది. ఇక మరో ఇద్దరికి స్థాన చలనం చేశారు. గత ఎన్నికల్లో గంగాధర నెల్లూరు నుంచి పోటీచేసి గెలిచిన ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిని ఈ సారి చిత్తూరు లోక్‌సభ బరిలో దించనున్నారు. ఎంపీగా ఉన్న రెడ్డెప్పను గంగాధర నెల్లూరు ఇన్‌చార్జిగా నియమించారు.

ఇప్పటి వరకూ వైసీపీ నాలుగు జాబితాలు విడుదల చేసింది. అందులో 10 మంది ఎంపీ అభ్యర్థులు, 58 ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మొత్తం 4 జాబితాల్లో 28 సిట్టింగులకు సీటు దక్కలేదు. ఇక మిగిలిన స్థానాల్లో కూడా మార్పులు అదేస్థాయిలో ఉంటాయని ప్రచారం జరుగుతోంది. గెలిచే అవకాశం లేని వారికి నిర్మొహమాటంగా టికెట్ లేదని సీఎం జగన్ చెప్పేస్తున్నారని తెలుస్తోంది.

Advertisement

ప్రతిపక్షాలు మాత్రం బీసీ, ఎస్సీలకే మొండిచేయి చూపిస్తున్నారని ట్రోల్ చేస్తున్నారు. నాలుగో జాబితాలో ఐదుగురు సిట్టింగులకు సీటు దక్కలేదు. అందులో నలుగురు ఎస్సీ ఎమ్మెల్యేలు, ఒక బీసీ ఎమ్మెల్యే ఉన్నారు. దీంతో.. బీసీ, ఎస్సీలనే జగన్ టార్గెట్ చేస్తున్నారని టీడీపీ ట్రోల్ చేస్తోంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×