E-Paper
Advertisement

Kali Arrest: పెట్రోల్ దాడి కేసు.. చిక్కిన కొడాలి నాని అనుచరుడు

Kali Arrest: పెట్రోల్ దాడి కేసు.. చిక్కిన కొడాలి నాని అనుచరుడు
Advertisement

Kali Arrest: వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుల అరెస్టుల పర్వం కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే అరెస్టయిన 13 మంది నిందితులు నెల్లూరు జైలులో ఉంటున్నారు. తాజాగా అస్సాంలో మరొకడ్ని అరెస్ట్ చేశారు గుడివాడ పోలీసులు. ఇంతకీ ఏ కేసులో అన్నడీటేల్స్ లోకి ఒక్కసారి వెళ్దాం.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నేతల అనుచరులు ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వారంతా పత్తా లేకుండా పోయారు. కొందరైతే పారిపోయారు కూడా. మరికొందరు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

Advertisement

రెండేళ్ల కిందట గుడివాడలో 2022 డిసెంబర్ 25న టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు బట్టల షాపుపై పెట్రోల్ దాడి చేశారు మాజీ మంత్రి కొడాలి నాని అనుచరులు. ఆ సమయంలో వాళ్లు చేసిన అరాచకం అంతాఇంతా కాదు. ఆ సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.

ప్రభుత్వం మారగానే ఆధారాలతో పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో 9 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, పెదపారుపూడి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అయితే ఈ కేసులో కీలక నిందితుడు కనిపించలేదు. ఎక్కడ ఉన్నాడో తెలీదు.

Advertisement

ALSO READ:  చిక్కుల్లో పేర్నినాని.. వెంటాడుతున్న రేషన్ బియ్యం.. ఈసారి ఆయన వంతు

పరిస్థితి గమనించిన పోలీసులు అన్నికోణాల్లో నిఘా పెట్టారు. దాడి కేసులో కాళీ కీలక నిందితుడు. కూటమి అధికారంలోకి రాగానే కాళీ అస్సాం పారిపోయాడు. చివరకు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా అస్సాంలో ఉన్నట్లు గుర్తించారు. గుడివాడ నుంచి ఓ పోలీసు టీమ్ అక్కడికి వెళ్లి వాడ్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఈ కేసులో మరికొందరి వివిధ రాష్ట్రాల్లో తలదాచుకుంటున్న విషయం తెల్సిందే. కాళీని విచారిస్తే దాడి వెనుక సూత్రదారులు ఎవరన్నది తేలనుంది. పోలీసులు ఇప్పుడు అదే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×