E-Paper
Advertisement

Yanamala Krishnudu Resign : టీడీపీకి షాక్.. వైసీపీ గూటికి యనమల కృష్ణుడు

Yanamala Krishnudu Resign : టీడీపీకి షాక్.. వైసీపీ గూటికి యనమల కృష్ణుడు
Advertisement

Yanamala Krishnudu Resigned to TDP : ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. టీడీపీకి భారీ షాక్ తగిలింది. తుని నియోజకవర్గంలో యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. 40 సంవత్సరాలుగా అన్న వెంటే ఉంటూ.. ఆయన గెలుపుకు కీలకమైన యనమల కృష్ణుడు టీడీపీకి గట్టి షాకిచ్చారు. ఇటీవల కాలంలో యనమల బదర్స్ మధ్య విబేధాలు బయటపడ్డాయి.

2014, 2019 ఎన్నికల్లో యనమల కృష్ణుడు ఓటమి పాలవ్వడంతో రామకృష్ణుడు తన కుమార్తెను బరిలోకి దింపారు. చంద్రబాబు నాయుడితో చర్చించి.. కుమార్తెకు సీటొచ్చేలా చేయడంతో.. తనను పక్కకు పెట్టేశారన్న భావన యనమల కృష్ణుడిలో మొదలైంది. ఈ ఎన్నికల్లో ఆయనకు టికెట్ రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. తుని నియోజకవర్గం నుంచి రెండుసార్లు టీడీపీ అభ్యర్థిగా దాడిశెట్టి రాజాపై పోటీచేసి ఓడిన ఆయన్ను అధిష్ఠానం పక్కనపెట్టింది.

Advertisement

Also Read : జగన్‌బాబు నీకిది తగునా, నిందితులకే రక్షణా?

కూతురి గెలుపుకోసం కష్టపడుతున్న రామకృష్ణుడు తనవైపు ఒక్కసారైనా చూడకపోవడంతో.. మనస్తాపానికి గురైన ఆయన టీడీపీకి రాజీనామా చేసి.. వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. టీడీపీకి ఆయన రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వైసీపీలో చేరడం దాదాపు ఖరారైనట్లేనని సన్నిహిత వర్గం చెబుతోంది. చంద్రబాబునాయుడే నేరుగా ఆయన్ను పిలిపించి మాట్లాడినా ఫలితం లేకపోయింది.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×