E-Paper
Advertisement

ఇంటి స్థలం వివాదం.. రోడ్డెక్కి జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు, వీడియో వైరల్!

ఇంటి స్థలం వివాదం.. రోడ్డెక్కి జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు, వీడియో వైరల్!
Advertisement

Plot Dispute: ఇంటి స్థలాలు, ఆస్తుల గొడవలు అంటే మాటలా? చిన్న సరిహద్దు తగాదా వచ్చినా సరే, బాహుబలి రేంజ్ డ్రామాలు కళ్లముందు కదలాడుతుంటాయి. సరిగ్గా ఇలాంటి విచిత్రమైన, అంతకన్నా దారుణమైన ఘర్షణ ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది. కాకపోతే ఇక్కడ హీరోలు లేరు.. ఓ రేంజ్‌లో రచ్చకెక్కిన విలనిజం మాత్రమే ఉంది. కనిగిరిలోని శివనగర్ కాలనీలో ఇంటి స్థలం వివాదం చిలికి చిలికి గాలివానలా మారి, చివరికి జుట్టు పట్టుకుని కొట్టుకునే స్థాయికి చేరింది.

శివనగర్ కాలనీకి చెందిన ఆర్నూరి నారాయణమ్మకు, అదే ప్రాంతంలో నివసించే కర్నాటి విజయభాస్కర్ రెడ్డి కుటుంబానికి మధ్య కొంతకాలంగా ఒక ఇంటి స్థలం విషయంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా గొడవలు జరుగుతున్నాయి. “ఈ స్థలం నాది అంటే నాది” అని ఇరువర్గాలు పట్టుబట్టడంతో మాట మాట పెరిగింది. సరైన పరిష్కారం వెతుక్కోవాల్సిన చోట, సహనం నశించి పగ, ప్రతీకారాలు పీక్స్‌కు చేరాయి. చివరికి ఆ స్థలమే ఒక కురుక్షేత్రాన్ని తలపించే యుద్ధరంగాలుగా మారిపోయింది.

Advertisement

అయితే, ఈ గొడవ సాధారణ మాటల యుద్ధంతో ఆగలేదు. విజయభాస్కర్ రెడ్డి, హర్షవర్ధన్, వారి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా నారాయణమ్మపై విరుచుకుపడ్డారు. చుట్టుపక్కల జనం సైలెంట్‌గా చూస్తుండగానే, సినిమా సీన్లను మించిపోయేలా ఆమె జుట్టు పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్తూ విచక్షణారహితంగా దాడి చేశారు. “అయ్యో.. ఆపండి” అని అరిచేనాథుడే కరువవ్వడంతో, ఆ వీధి కాస్తా క్షణాల్లో హైడ్రామాకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.

ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో ఆ సమయానికి కాలనీవాసులు మాత్రమే కాదు, నెటిజన్లు కూడా ముక్కున వేలేసుకున్నారు. బాధితురాలు నారాయణమ్మ ఈ అన్యాయంపై స్థానిక పోలీసులను ఆశ్రయించడంతో అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఏదేమైనా.. చిన్న స్థలం ముక్క కోసం మనుషులు తమ మానవత్వాన్ని మర్చిపోయి, ఇలా వీధి కొట్లాటలకు దిగడం చూస్తుంటే “కాలం ఎటుపోతోందో” అని స్థానికులు పెదవి విరుస్తున్నారు.

Advertisement

Also Read: ఒళ్లో అమ్మాయిని కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఏం చేశారంటే?

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×