E-Paper
Advertisement

Anchor Shyamala: బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన వైసీపీ నేత శ్యామల.. అరెస్టు చేస్తారా?

Anchor Shyamala: బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన వైసీపీ నేత శ్యామల.. అరెస్టు చేస్తారా?
Advertisement

Anchor Shyamala Betting Apps Promotion: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి పలువురు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ మీద కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా 11 మంది యూట్యూబర్ల మీద హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రముఖ యాంకర్, వైసీపీ నాయకురాలు ఆరె శ్యామల వ్యవహారం సంచలనం కలిగిస్తోంది. గతంలో ఆమె కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆమెపైనా కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది.

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో శ్యామలను అరెస్ట్ చేస్తారా?

Advertisement

ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ విషయంలో సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికే పలువురి మీద కేసులు నమోదు చేయడంతో పాటు వారిని అరెస్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే యాంకర్ శ్యామల కూడా ఈ ఉచ్చులో చిక్కుకోవడం ఖాయం అని భావిస్తున్నారు. కొద్ది రోజులుగా ఆమె పోస్ట్ చేసిన పలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమెను కూడా అరెస్ట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, శ్యామల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కు సంబంధించి వీడియోలను.. ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కు నెటిజన్స్ ట్యాగ్ చేస్తున్నారు. సెలబ్రిటీ, యాంకర్, సినిమా ఆర్టిస్టు, రాజకీయ పార్టీ అధికార ప్రతినిధి అయిన ఆమె, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తోందని, అమాయకులను బలిచేస్తున్న ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  ఇప్పటికే కాంట్రవర్సీలు శ్యామలను ఇబ్బంది పెడుతుండగా, ఇప్పుడు బెట్టింగ్స్ వివాదం మెడకు చుట్టుకునేలా ఉంది. ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

Advertisement

11 మంది యూట్యూబర్లపై కేసు నమోదు

అటు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది యూట్యూబర్లపై హైదరాబాద్ సిటీ పోలీసుల కేసు నమోదు చేశారు. యువత ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్న హర్ష సాయి, విష్ణు ప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, రీతు చౌదరి, టేస్టీ తేజ, అజయ్, కిరణ్ గౌడ్, బయ్యా సన్నీ యాదవ్, సుధీర్ రాజుపై కేసులు ఫైల్ చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ లక్షలాది రూపాయులు వెనుకేసుకోవడంతో పాటు అమాయక యువకులను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్న వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనాలు కోరుతున్నారు.

బెట్టింగ్ యాప్స్ నిర్మూలన ఉద్యమాన్ని మొదలు పెట్టిన సజ్జనార్

అటు ఈ బెట్టింగ్ యాప్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఆన్ లైన్ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న ఇన్ ఫ్లూయెన్సర్లు అన్ ఫాలో కొట్టాలని నెటిజన్లకు పిలుపునిచ్చారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులకు సూచిస్తున్నారు. ఆయనకు మద్దతుగా పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు.

Read Also: బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్లు.. ఒక్క యాడ్ కోసం ఎంత తీసుకుంటారో తెలుసా?

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×