E-Paper
Advertisement

ACB Raids: ఏసీబీలోనే ఉంటూ.. ఏసీబీకే కన్నం వేసిన ‘కిలాడీ’ హోంగార్డు!

ACB Raids: ఏసీబీలోనే ఉంటూ.. ఏసీబీకే కన్నం వేసిన ‘కిలాడీ’ హోంగార్డు!
Advertisement

ACB Raids: విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు నివాసాలపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. సాధారణంగా హోంగార్డు స్థాయి ఉద్యోగికి వచ్చే ఆదాయానికి.. ఈయన దగ్గర లభ్యమైన ఆస్తులకు పొంతన లేకపోవడంతో అధికారులు షాక్‌కు గురయ్యారు. విజయనగరం, విశాఖపట్నం, గుర్ల ప్రాంతాల్లోని ఆయనకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి.

శ్రీనివాసరావు గతంలో సుమారు 15 ఏళ్ల పాటు ఏసీబీ విభాగంలోనే పనిచేయడం గమనార్హం. ఆ సమయంలో అధికారులు ఎవరిపై దాడులు చేయబోతున్నారు, ఎక్కడ సోదాలు జరగనున్నాయి అనే అత్యంత రహస్య సమాచారాన్ని ఆయన ముందుగానే తెలుసుకునేవారు. ఈ సమాచారాన్ని సంబంధిత అవినీతి అధికారులకు చేరవేసి.. వారి నుంచి భారీ మొత్తంలో ప్రతిఫలం పొందేవాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా వ్యవస్థలోని లొసుగులను వాడుకుని కోట్లాది రూపాయల సంపదను వెనకేశాడు.

Advertisement

శ్రీనివాసరావుపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో.. గతంలోనే అతడిని ఏసీబీ విభాగం నుండి జిల్లా పోలీస్ కార్యాలయానికి బదిలీ చేశారు. అయినప్పటికీ పాత పరిచయాలతో తన అక్రమ కార్యకలాపాలను కొనసాగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరిపిన సోదాల్లో సుమారు రూ. 20 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. ఇందులో విలాసవంతమైన భవనాలు, భూములు, నగదు ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటన పోలీస్ శాఖలోని ఇతర సిబ్బందిని విస్మయానికి గురిచేయడమే కాకుండా, వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతోంది. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి, ఈ ఆస్తుల వెనుక ఇంకా ఎవరి హస్తమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.

Advertisement

ALSO READ:ఆఫీస్ ట్రిప్‌లో అరాచకం.. ఆపై వేధింపులు.. మహిళా ఉద్యోగి ఫిర్యాదుతో హెచ్ఆర్ అరెస్ట్

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×