E-Paper
Advertisement

విశాఖలో కాంక్రేజ్ ఎద్దుల సందడి.. రోజుకు 15 లీటర్ల పాలిచ్చే ఆవు..

విశాఖలో కాంక్రేజ్ ఎద్దుల సందడి.. రోజుకు 15 లీటర్ల పాలిచ్చే ఆవు..
Advertisement

Kankrej Cow Bull: విశాఖపట్నంలోని సింహాచలం సమీపంలో జరుగుతున్న శబల భోజనాల పండగ సందడి పల్లె వాతావరణాన్ని తలపిస్తోంది. ఆధునిక నగర జీవనంలో పాత తరం ఆరోగ్య రహస్యాలను, దేశీయ వ్యవసాయ పద్ధతులను పరిచయం చేయడమే లక్ష్యంగా సాగుతున్న ఈ ఉత్సవంలో రాజస్థాన్.. గుజరాత్ సరిహద్దు ప్రాంతాల నుండి తీసుకువచ్చిన ‘కాంక్రేజ్’ (Kankrej) జాతి ఎద్దు, ఆవు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సుమారు రూ. 2.5 లక్షల భారీ వ్యయంతో వీటిని ఇక్కడికి తీసుకువచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. చూడటానికి గంభీరంగా, భారీ కొమ్ములతో భయంకరంగా కనిపిస్తున్నప్పటికీ, ఇవి మనుషులతో ఎంతో స్నేహపూర్వక(ఫ్రెండ్లీ)గా ఉంటాయని యజమానులు చెబుతున్నారు.

ఈ ఉత్సవానికి హైలైట్‌గా నిలుస్తున్న కాంక్రేజ్ ఆవులు రోజుకు 8 నుండి 15 లీటర్ల వరకు పాలు ఇస్తాయని విజయనగరానికి చెందిన గోశాల నిర్వాహకుడు దొడ్డ మహేష్ వివరించారు. సాధారణంగా దేశీయ ఆవులు తక్కువ పాలు ఇస్తాయనే అపోహను తొలగించి, రైతులకు లాభసాటిగా ఉండే బ్రీడ్లను పరిచయం చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. గుజరాత్, పాకిస్థాన్ సరిహద్దుల్లోని కచ్ ప్రాంతానికి చెందిన ఈ జాతి పశువులు ఎటువంటి కఠినమైన వాతావరణ పరిస్థితులనైనా తట్టుకోగలవని, మన ప్రాంతపు క్లైమేట్‌కు కూడా ఇవి త్వరగా అలవాటు పడతాయని ఆయన వెల్లడించారు.

Advertisement

కేవలం పాల కోసమే కాకుండా, కాంక్రేజ్ ఎద్దులు వ్యవసాయ పనుల్లో అత్యంత బలంగా పనిచేస్తాయని నిర్వాహకులు తెలిపారు. పాత తరం పద్ధతుల్లో దేశీయ ఎద్దులతో సాగు చేయడం ద్వారా పండించే పంటలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఈ శబల భోజనాల పండగ వేదికగా చాటిచెబుతున్నారు. ఈ ఎద్దులు ఎంత బరువునైనా సులువుగా మోయగల సామర్థ్యం కలిగి ఉంటాయని, వీటిని పెంచడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని వివరించారు. ఈ ప్రదర్శనలో కాంక్రేజ్‌తో పాటు పుంగనూరు, సాహివాల్, రాఠి, తార్‌పార్కర్, గిర్ వంటి మరో ఎనిమిది రకాల దేశీయ గోవులను కూడా సందర్శకుల కోసం అందుబాటులో ఉంచారు.

సిటీ ప్రజలకు పల్లెటూరి రుచులను, స్వచ్ఛమైన ఆహార ఉత్పత్తులను పరిచయం చేయడమే ఈ పండగ ముఖ్య ఉద్దేశం. ఒకప్పుడు మన తాత ముత్తాతలు తిన్న ఆహార పదార్థాలు, వాడిన దేశీయ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. “మనం ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలంటే దేశీయ ఆవు పాలు, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులే మార్గం” అని శబల నిర్వాహకులు పేర్కొంటున్నారు. గంభీరమైన కొమ్ములు, భారీ రూపంతో కనిపిస్తున్న ఈ కాంక్రేజ్ ఎద్దులు, ఆవుల వద్ద ఫొటోలు దిగేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. ప్రకృతి ఒడిలో దేశీయ పశు సంపదను కాపాడుకోవాలనే సందేశాన్ని ఈ ఉత్సవం సమర్థవంతంగా అందిస్తోంది.

Advertisement

Read Also: డైనోసార్ తోలుతో హ్యాండ్ బ్యాగ్.. రూ.4 కోట్లు ఉంటే మీ సొంతం!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×