E-Paper
Advertisement

Visakhapatnam: తప్పతాగి ట్రాఫిక్ ఎస్సైని కొట్టిన నేవీ ఆఫీసర్.. తర్వాత ఏమైందంటే?

Visakhapatnam: తప్పతాగి ట్రాఫిక్ ఎస్సైని కొట్టిన నేవీ ఆఫీసర్.. తర్వాత ఏమైందంటే?
Advertisement

Visakhapatnam: విశాఖపట్నం మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ నేవీ ఆఫిసర్ వీరంగం సృష్టించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి..  మద్యం మత్తులో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా  విధుల్లో ఉన్న పోలీసులపై భౌతిక దాడికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.

మల్కాపురం సమీపంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) పైప్‌లైన్ పనులు జరుగుతుండటంతో భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు ఆ మార్గంలో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో..  ఇండియన్ నేవీలో లెఫ్టినెంట్ కమాండర్‌గా పనిచేస్తున్న రాహుల్ కృష్ణన్ తన వాహనంలో VDR జంక్షన్ నుండి సింధియా జంక్షన్ వైపు అతివేగంగా దూసుకొచ్చారు. రహదారి మూసివేసి ఉండటంతో అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాసరావు,  ఇతర సిబ్బంది ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు.

Advertisement

మద్యం మత్తులో ఉన్న రాహుల్ కృష్ణన్..  పోలీసులు అడ్డుకోవడాన్ని సహించలేకపోయారు. కారు దిగి పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఎస్సై శ్రీనివాసరావు సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ..  నిందితుడు విచక్షణ కోల్పోయి ఆయనపై దాడికి తెగబడ్డారు. ప్రభుత్వ ఉద్యోగి అని కూడా చూడకుండా అనుచితంగా ప్రవర్తిస్తూ భౌతిక దాడికి పాల్పడటంతో అక్కడున్న సిబ్బంది షాక్‌కు గురయ్యారు.

 వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆయనకు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించగా..  మద్యం సేవించినట్లు నిర్ధారణ అయ్యింది. బాధితుడైన ట్రాఫిక్ ఎస్సై ఫిర్యాదు మేరకు మల్కాపురం లా అండ్ ఆర్డర్ పోలీసులు రాహుల్ కృష్ణన్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు  అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన రక్షణ రంగ అధికారి ఇలాంటి ఉన్మాద చర్యకు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

ALSO READ: Alluri district: తండ్రీకొడుకుల ప్రాణం తీసిన కోడిపుంజు.. నర్సింగ పేటలో తీవ్ర విషాదం!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×