E-Paper
Advertisement

Vizag MLC Elections: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ రిలీజ్

Vizag MLC Elections: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ రిలీజ్
Advertisement

Notification For Vizag MLC Elections(Political news in AP): ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ నామినేషన్ల స్వీకరణ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు వరకు ఉండనుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ సెలవు దినాల్లో కాకుండా మిగతా అన్ని రోజుల్లో నామినేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

ఆగస్టు 6న నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఈ నెల 13 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. ఆగస్టు 14 వ తేదిన స్క్రూటీ ఉండగా.. ఆగస్టు 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అలాగే అదే రోజు తుది అభ్యర్థుల వివరాలను వెల్లడించనున్నారు.

Advertisement

అలాగే ఆగస్టు 30న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సెప్టెంబర్ 3న ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ఉండనుంది. మొత్తం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొత్తం 838 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఇందులో వైసీపీకి చెందిన ఓట్లు 615, కూటమికి 215 ఓట్లు ఉన్నాయి.

Also Read: 8న టీడీపీ పొలిట్ బ్యూరో మీటింగ్, వాటిపై అధినేత క్లారిటీ..

Advertisement

ఇదిలా ఉండగా, ఈ ఎన్నికల్లో విశాఖ జిల్లాతోపాటు అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు చెందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీ సభ్యులు ఓటర్లు ఉన్నారు. వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ఎంపిక చేయగా.. కూటమి అభ్యర్థిగా ఇప్పటివరకు పేరు ఖరారు చేయలేదు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×