// // Vizag Beach Tragedy: విశాఖ సాగరతీరంలో ఘోరం.. సరదాలో విషాదం -->
E-Paper
Advertisement

Vizag Beach Tragedy: విశాఖ సాగరతీరంలో ఘోరం.. సరదాలో విషాదం, ఇద్దరు స్టూడెంట్స్ గల్లంతు

Vizag Beach Tragedy: విశాఖ సాగరతీరంలో ఘోరం.. సరదాలో విషాదం,  ఇద్దరు స్టూడెంట్స్ గల్లంతు
Advertisement

Vizag Beach Tragedy: విశాఖ సాగర తీరంలో విషాదం చోటు చేసుకుంది. వీకెండ్ కావడంతో కొందరు విద్యార్థులు సరదాగా సముద్రం స్నానానికి వెళ్లారు. ఒక్కసారిగా కెరటాలు బలంగా వచ్చాయి. ఈ క్రమంలో కెరటాల మధ్యలో చిక్కుకుని ఇద్దరు విద్యార్థులు గల్లంతు అయ్యారు. రాత్రి 11 గంటల వరకు ఆ విద్యార్థుల ఆచూకీ కనిపించలేదు.

విశాఖ సాగరతీరంలో ఘోరం

Advertisement

వీకెండ్ వస్తే చాలు.. విశాఖ సాగర తీరం పర్యాటకులతో కళకళలాడుతుంటుంది. అయితే ఆనందంలో విషాదం కూడా ఉంటుంది. విశాఖ సిటీలోని బుల్లయ్య కాలేజీలో డిగ్రీ చదువుతున్నారు విద్యార్థులు. అందులో ఎనిమిది మంది శనివారం సాయంత్రం సాగర తీరానికి వెళ్లారు.

ఉడా పార్కు సమీపంలోని లైట్ హౌస్ వద్దకు చేరుకున్నారు. అందరూ కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడిపారు. మొత్తం ఎనిమిది మందిలో నలుగురు స్నానానికి దిగారు. ఆ సమయంలో ఉలల ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. బలంగా కెరటాలు రావడంతో ఇద్దరు విద్యార్థులను గల్లంతు అయ్యారు. వారిలో నరేంద్రపు ఆధిత్య 20 ఏళ్లు కాగా, తేజేష్ ఉన్నారు.

Advertisement

స్నానానికి దిగిన ఇద్దరు స్టూడెంట్స్ గల్లంతు

అలలు వారిని లోపలికి లాక్కెళ్లిపోయాయి. అయితే ఈత వచ్చిన మరో ఇద్దరు విద్యార్థులు మాత్రమే బయటపడ్డారు. తమ కళ్ల ఎదుట ఫ్రెండ్స్ సముద్రం లోపలకు కొట్టుకుపోవడాన్ని జీర్ణించుకోలేక కన్నీరు మున్నీరయ్యారు. ఈ విషయం తెలియగానే త్రీ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గల్లంతయిన ఇద్దరు విద్యార్థుల కోసం గాలింపు చేపట్టారు. మత్స్యకారులు, కోస్ట్‌గార్డు బోట్లతో గాలింపు చేపట్టారు.

రాత్రి 11 గంటల వరకు వారి ఆచూకీ తెలియరాలేదు. వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మొత్తం ఎనిమిది మంది విద్యార్థులు అక్కడకు వచ్చినట్టు పోలీసులు చెప్పారు. బుల్లయ్య కళాశాలలో బీఎస్సీ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. మరో ఆరునెలల్లో డిగ్రీ పూర్తి కావాల్సి ఉండగా అంతలోనే ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తమ పిల్లల నుంచి విషయం తెలియగానే వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. ఎదిగిన కొడుకు ఆ లోకాన్ని విడిచిపెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

ALSO READ: బిగ్ టీవీ ఎఫెక్ట్.. అరటి రైతులకు బిగ్ రిలీఫ్

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×