E-Paper
Advertisement

Vishnu Kumar Raju: కూర్చొంటే చాలు అదే కడిగేస్తది.. రుషికొండ ప్యాలెస్‌ టాయిలెట్‌పై విష్ణు రాజు పంచ్‌లు

Vishnu Kumar Raju: కూర్చొంటే చాలు అదే కడిగేస్తది.. రుషికొండ ప్యాలెస్‌ టాయిలెట్‌పై విష్ణు రాజు పంచ్‌లు
Advertisement

MLA Vishnu Kumar Raju: ఏపీ అసెంబ్లీ సీరియస్ గా సాగుతోంది. అంతలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మైక్ అందుకున్నారు. ఇక అంతే సభ మొత్తం నవ్వులే నవ్వుల్. అది కూడా స్పీకర్, సీఎం, డిప్యూటీ సీఎం లతో సహా..

వైజాగ్ లో రుషికొండ ప్యాలెస్ గురించి తెలియని వారుంటారా చెప్పండి. కూటమి విజయాన్ని అందుకున్న అనంతరం.. ఫేమస్ గా నిలిచిన ప్యాలెస్ ఇది. దీనికి కారణం ఎన్నికల ముందు వరకు అసలు ఈ ప్యాలెస్ దరిదాపుల్లోకి కూడా ఎవరికీ అనుమతి లేకపోవడమే. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం మారగా, రుషికొండ ప్యాలెస్ నిగ్గు తేల్చేందుకు మీడియాతో రంగప్రవేశం చేశారు టీడీపీ నేతలు. అందులో ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా వార్తల్లో నిలిచింది ఏదో కాదు.. అక్కడి అధునాతన టాయ్ లెట్.

Advertisement

ఇటీవల సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు సైతం ఈ ప్యాలెస్ సందర్శించి, కోట్ల రూపాయల నిధులను గత ప్రభుత్వం స్వార్థపూరితంగా వ్యవహరించి వృధా చేసినట్లు విమర్శించారు. అయితే తాజాగా ఈ ప్యాలెస్ లోని టాయిలెట్‌ గురించి అసెంబ్లీ మార్మోగింది.

అసెంబ్లీ లో బీజేపీ ఎమ్మేల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. ఏదిఏమైనా మాజీ సీఎం హుందాతనానికి రుషికొండ ప్యాలెస్ నిదర్శనమన్నారు. అందులో కూడా ప్యాలెస్ లోని టాయిలెట్‌ మాత్రం ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉందని అనగానే, సభ్యులంతా చిరునవ్వులు చిందించారు. ఈ టాయిలెట్‌ అక్షరాలా రూ. 11,46,840 ధర పలికినట్లు తనకు తెలిసిందని, అలాగే వాష్ బేసిన్ ధర రూ. 2,61,500 లు గా తెలిపారు.

Advertisement

Also Read: Lady Aghori at Dilsukhnagar: త్వరలోనే ‘అది’ కోస్తానంటున్న అఘోరీ.. అందరి ముందే అలా చేస్తానంటూ..

సభలో ఎందరో కోటీశ్వరులు ఉన్నారని, కానీ ఇంతటి సదుపాయం గల టాయిలెట్‌ వాడుతున్నారో లేదో తనకు తెలియదన్నారు. రుషికొండ టాయిలెట్ గురించి ప్రత్యేకతలు తెలుసుకొని తాను షాక్ కు గురయ్యానని, వెళ్లి అలా కూర్చుంటే చాలు.. అలా వాష్ చేసే సౌలభ్యం ఆటోమేటిక్ గా ఉందన్నారు. చేతులు కూడా అవసరం లేకుండా.. మంచి సౌలభ్యం ఉన్న టాయిలెట్‌ అంటూ విష్ణు రాజు అనగానే స్పీకర్ తో సహా అసెంబ్లీ లో నవ్వులు విరబూశాయి. ఇలా మరోమారు రుషికొండ ప్యాలెస్ వార్తల్లో నిలిచింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×