E-Paper
Advertisement

Vishaka: విశాఖ దంపతుల మిస్సింగ్ మిస్టరీ విషాదాంతం..

Vishaka: విశాఖ దంపతుల మిస్సింగ్ మిస్టరీ విషాదాంతం..
Advertisement

Vishaka: విశాఖ దంపతులు మిస్సింగ్ మిస్టరీ విషాదంగా ముగిసింది. మంగళవారం కన్పించకుండా పోయిన వరప్రసాద్ దంపతుల్లో ఒకరు విగతజీవిగా కన్పించారు. కొప్పాక ఏలూరు కాలువలో వరప్రసాద్ మృతదేహం లభ్యమైంది.

విశాఖ గాజువాకకు చెందిన దంపతుల జంట తాము ఆత్మహత్య చేసుకోబోతున్నామంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే చనిపోతున్నట్లుగా ఆ వీడియోలో తెలిపారు. తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు.

Advertisement

సెల్ఫీ వీడియో తర్వాత ఇద్దరి ఫోన్లు స్విఛాప్ అయ్యాయి. వారికోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అనకాపల్లి కొప్పాక ఏలూరు కాలువ దగ్గర చెప్పులు, హ్యాండ్ బ్యాగులు, మొబైల్ ఉన్నట్టు గుర్తించారు.

ఆ జంట.. కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు భావించి.. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది గాలింపు చేపట్టారు. కానీ, ఎన్నిగంటలు గడిచినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. చీకటి పడటంతో సెర్చ్ ఆపరేషన్ తాత్కాలికంగా ఆపేశారు. బుధవారం ఉదయమే మళ్లీ గాలింపు మొదలుపెట్టగా.. వరప్రసాద్ మృతదేహం లభించింది. అతని భార్య మీరా డెడ్ బాడీ కోసం గాలింపు కొనసాగుతోంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×