E-Paper
Advertisement

AP Tourism Homestay: విశాఖ వాసులకే ఈ ఆఫర్.. నెలకు రూ. 50 వేలు దక్కే ఛాన్స్..

AP Tourism Homestay: విశాఖ వాసులకే ఈ ఆఫర్.. నెలకు రూ. 50 వేలు దక్కే ఛాన్స్..
Advertisement

AP Tourism Homestay: మీరు విశాఖలో ఉంటున్నారా? అయితే ఈ ఛాన్స్ సూపర్ అనాల్సిందే. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఓ నిర్ణయంతో, ఇక్కడి నగర వాసులకు నెలకు కూర్చొని రూ. 50,000 దక్కే ఛాన్స్ దక్కింది. ఇలాంటి మరి ఏ నగరానికి లేదని చెప్పవచ్చు. మరి విశాఖ వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలంటే, ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే.

విశాఖ నగరమే ఒక వరం..
పర్యాటక పరంగా విశాఖపట్నం (Vizag) రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. బీచ్‌లు, అరకు, బోర్రగుహలు, కైలాసగిరి వంటి అద్భుతమైన ప్రదేశాలతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇలాంటి సమయంలో, స్థానికులకూ ఆదాయం పొందే అవకాశంగా మారింది. ఆ అవకాశమే హోమ్‌స్టేలు. ఈ అవకాశాన్ని నగరవాసులకు చేరువ చేసింది ఏపీ ప్రభుత్వం.

Advertisement

హోమ్‌స్టే అంటే ఏమిటి?
హోటళ్లను కాకుండా, పర్యాటకులు స్థానికుల ఇళ్లలో ఉండే విధానమే హోమ్‌స్టే. అంటే, మీ ఇంటిలోని ఓ గది లేదా అంతస్తును రోజువారీ అద్దెకు ఇచ్చే అవకాశం. ఇది పర్యాటకులకు ఆత్మీయతను, స్థానిక జీవనశైలిని పరిచయం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ 2025 – 2029 పర్యాటక విధానంలో భాగంగా హోమ్‌స్టే నమోదు ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ఈ విధానం ద్వారా పర్యాటకులకు తక్కువ ధరలో బస, స్థానికులకు ఆదాయం రెండు లక్ష్యాలు నెరవేరుతాయి.

హోమ్‌స్టే నమోదు ఎలా చేయాలి?
మీ ఇంటిని హోమ్‌స్టేగా నమోదు చేయాలంటే ముందుగా Andhra Pradesh Tourism అధికారిక వెబ్‌సైట్‌ను (https://tourism.ap.gov.in) లేదా కేంద్ర నిధి పోర్టల్‌ను (https://nidhi.tourism.gov.in) సందర్శించాలి. అక్కడ హోమ్‌స్టే హాస్టెల్/బెడ్ & బ్రేక్‌ఫాస్ట్ స్కీంలో రిజిస్ట్రేషన్ చేయవచ్చు. మీ ఇంటికి సంబంధించిన ఫోటోలు, చిరునామా, గదుల వివరాలు, ID ప్రూఫ్ మొదలైనవీ అప్‌లోడ్ చేయాలి. ఒకసారి నమోదు అయిన తర్వాత, ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం హోమ్‌స్టేకు గుర్తింపు లభిస్తుంది.

Advertisement

ఇంట్లో కనీసం ఒక గది..
ఈ పథకం కోసం మీ ఇంట్లో కనీసం ఒక గది బాగా ఉండాలి. బాత్రూం, మంచం, శుభ్రత, రక్షణ వంటి అంశాలపై అధికారులు తనిఖీ చేస్తారు. ఒక ఇంట్లో గరిష్ఠంగా 6 గదులు వరకు హోమ్‌స్టేగా నమోదు చేయవచ్చు.

Also Read: Sunny Yadav: భయ్యా సన్నీ అరెస్ట్.. పాక్ నుండి రాగానే అదుపులోకి.. ఎన్ఐఏ రంగంలోకి?

పర్యాటకుల కోసం ప్రత్యేక అనుభవం
హోటళ్ల కంటే హోమ్‌స్టేలు పర్యాటకులకు ఇంట్లో ఉన్న ఫీల్ ఇస్తాయి. విశాఖలోని స్థానిక సంప్రదాయాలను, ఆహారాన్ని, సంస్కృతిని దగ్గరగా అనుభవించేందుకు ఇది బెస్ట్ ఛాన్స్. అందుకే విదేశీ పర్యాటకులకి హోమ్‌స్టేలు చాలా ఇష్టంగా ఉంటాయి.

విశాఖకు ప్రత్యేక గుర్తింపు
విశాఖపట్నం సిటీ ఆఫ్ డెస్టినిగా పేరుగాంచింది. ఇప్పుడు ఇది హోమ్‌స్టే సిటీగా కూడా మారే దిశగా ఉంది. ఇప్పటికే అరకు, పాడేరు, భీమిలి, యారాడ వంటి ప్రాంతాల్లో పలు హోమ్‌స్టేలు కార్యకలాపాలు మొదలుపెట్టాయి.

ఆర్థికంగా లాభదాయకం
మీ ఇంటి ఖాళీ గదిని అద్దెకు ఇచ్చి నెలకు రూ. 10,000 నుండి రూ. 40,000 వరకు ఆదాయం పొందవచ్చు. ఇది ఉద్యోగం లేకపోయినా కుటుంబానికి తగిన ఆదాయ మార్గంగా మారుతుంది. ముఖ్యంగా గృహిణులు, సీనియర్ సిటిజన్లకు ఇది మంచి అవకాశం.

సంప్రదించండి
మీరు విశాఖలో ఉంటే, హోమ్‌స్టేగా మీ ఇంటిని నమోదు చేయాలంటే VMRDA టూరిజం కార్యాలయం నంబర్ 0891-2754716, AP Tourism వెబ్‌సైట్ https://tourism.ap.gov.in లను సంప్రదించండి. ఈ విధానం ద్వారా పర్యాటక రంగం మరింత విస్తరిస్తుంది. స్థానికుల జీవనోపాధి మెరుగవుతుంది. పర్యాటకులు కూడా తమ ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా అనుభవించగలుగుతారు. విశాఖ ప్రజలకు ఇది ఒక బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. మీ ఇంటిని హోమ్‌స్టేగా మార్చడం అనేది కేవలం అద్దె పొందడం కాదు. అది పర్యాటకులతో స్నేహం, సంస్కృతి మార్పిడి, ఆదాయాన్ని కలిగించే మార్గం. విశాఖకు వచ్చే వారి బసను ప్రత్యేకంగా మార్చే అవకాశం మీ ఇంటిలోనే ఉంది. డోంట్ మిస్ దిస్ ఛాన్స్!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×