E-Paper
Advertisement

Fake Gold in Vizag: 2.2 కిలోల నకిలీ బంగారం తాకట్టు పెట్టి.. రూ.68 లక్షల మోసం.. విశాఖలో గోల్‌మాల్!

Fake Gold in Vizag: 2.2 కిలోల నకిలీ బంగారం తాకట్టు పెట్టి.. రూ.68 లక్షల మోసం.. విశాఖలో గోల్‌మాల్!
Advertisement

Fake Gold in Vizag: నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి పెద్ద మొత్తంలో డబ్బును కాజేసిన ఘటన వైజాగ్‌లో చోటు చేసుకుంది. ఎకంగా బ్యాంక్ సిబ్బందే స్కాం చేయడంతో వైజాగ్‌లో ఈ ఘటన సంచలనంగా మారింది. బ్యాంక్‌లలో తాకట్టు పెట్టిన బంగారం విడిపించి కమిషన్ వ్యాపారం చేసే జగదీశ్వర్ రావు అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో నకిలీ బంగారం వ్యవహారం బయటకు వచ్చిందని ద్వారకా నగర్ పోలీసులు తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం.. జగదీశ్వర్ రావు, అవినాష్ అనే ఇద్దరు స్నేహితులు కొంతకాలం క్రితం రూపిక్ బ్యాంక్‌లో 2.2 కేజీల బంగారాన్ని తాకట్టు పెట్టారు. తాకట్టు పెట్టిన బంగారాన్ని ఇటీవల విడిపించుకునేందుకు బ్యాంక్‌కు వెళ్లారు. బ్యాంక్‌లో రూ.68 లక్షల 31 వేలు కట్టి బంగారాన్ని తిరిగి తీసుకున్నారు. అయితే ఇంటికి వెళ్లి పరిశీలిస్తే బంగారం  తేడాగా అనిపించిదని జగదీశ్వర్ తెలిపారు. గోల్డ్‌ను తనిఖీ చేసి నకిలీ బంగారంగా అఫ్రైజర్ గుర్తించారు.

Advertisement

దీంతో జగదీశ్, అవినాశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీళ్ల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. రూపిక్ బ్యాంక్‌లో పని చేస్తున్న ఈశ్వరరావు, రాఘవేంద్రరావు, మోహన్ రావు, సుబ్బారావు నకిలీ బంగారాన్ని పెట్టినట్లుగా గుర్తించామని పోలీసులు వెల్లడించారు. మోసం చేసిన నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

విచారణ తర్వాత ఇప్పటి వరకు వీళ్లు ఎన్ని మోసాలు చేశారు. దీని వల్ల ఇంకా ఎంత మంది నష్టపోయారు అనే వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. పూర్తి దర్యాప్తు తర్వాత నిందితులు కాజేసిన నగదు, బంగారం వివరాలు వెల్లడిస్తామన్నారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×