E-Paper
Advertisement

Vijayawada Walkers Protest: విజ‌య‌వాడ‌లో మార్కింగ్ వాక‌ర్స్ నిర‌స‌న‌.. చివ‌ర‌కు తాళాలు ప‌గ‌ల‌గొట్టి మైదానంలోకి వెళ్లి!

Vijayawada Walkers Protest: విజ‌య‌వాడ‌లో మార్కింగ్ వాక‌ర్స్ నిర‌స‌న‌.. చివ‌ర‌కు తాళాలు ప‌గ‌ల‌గొట్టి మైదానంలోకి వెళ్లి!
Advertisement

విజ‌య‌వాడ ల‌యోలా కాలేజీ వ‌ద్ద వాక‌ర్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఈరోజు ఉద‌యం నిర‌స‌న చేప‌ట్టారు. ప్ర‌తిరోజుల క‌ళాశాల మైదానంలో వాక‌ర్స్ వాకింగ్ చేస్తుంటారు. అయితే నేడు గేటు లోప‌లికి అనుమ‌తించ‌క‌పోవ‌డంతో ఆగ్ర‌హానికి గురైన వాక‌ర్స్ గేటు ముందు ధ‌ర్నాకు దిగారు. వెంట‌నే త‌మ‌ను లోప‌లికి అనుమ‌తించాల‌ని డిమాండ్ చేశారు. గ‌త 25 సంవ్స‌రాలుగా న‌గ‌ర‌వాసులు ల‌యోలా కాలేజీ వాక‌ర్స్ పేరుతో మైదానంలో వాకింగ్ చేస్తున్న‌ట్టు చెబుతున్నారు. దాదాపు మూడు వేల మంది స‌భ్యుల‌తో వాక‌ర్స్ ఉంద‌ని తెలిపారు.

అయితే క‌రోనా స‌మ‌యంలో క‌ళాశాల గేటును మూసి వేశారు. అప్పటి నుండి వాకింగ్ ట్రాక్ తెర‌వాలని అసోసియేష‌న్ వాళ్లు ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. ఈ విష‌యం ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినా స‌మ‌స్య ప‌రిష్కారం అవ్వ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కేవ‌లం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల‌కు మాత్ర‌మే క‌ళాశాల‌లో వాకింగ్ కు అనుమ‌తిస్తున్నార‌ని తెలిపారు.

Advertisement

ఎన్నిక‌ల స‌మ‌యంలో కూటమి స‌ర్కార్ అధికారంలోకి వ‌స్తే వాక‌ర్స్ కు అనుమ‌తి ఇచ్చేలా చూస్తామ‌ని, వాకింగ్ ట్రాక్ తెరిపిస్తామ‌ని నేత‌లు హామీ ఇచ్చారన్నారు. ఈ క్ర‌మంలోనే చాలా సార్లు వాకింగ్ ట్రాక్ తెర‌వాల‌ని క‌ళ‌శాల యాజ‌మాన్యాన్ని ఎన్నిసార్లు కోరినా అనుమ‌తి నిరాక‌రిస్తుండ‌టంతో క‌ళాశాల ముందు ధ‌ర్నా చేశారు. ఈ క్ర‌మంలో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. సీనియ‌ర్ సిటిజ‌న్లు, న‌గ‌ర వాసుల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వాక‌ర్స్ ను అనుమ‌తించాల‌ని డిమాండ్ చేశారు. చివ‌రికి గేటు తాళాలు ప‌గ‌ల‌గొట్టి లోప‌ల‌కి వెళ్లి వాకింగ్ చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×