E-Paper
Advertisement

ఊహించని ప్లాన్ చేస్తున్న జగన్.. ఆ ఇద్దరు నేతలు వస్తే, ఇక కూటమికి చుక్కలు తప్పవా?

ఊహించని ప్లాన్ చేస్తున్న జగన్.. ఆ ఇద్దరు నేతలు వస్తే, ఇక కూటమికి చుక్కలు తప్పవా?
Advertisement

Jagan Master Plan: అధికారం పోయిన రెండేళ్ల తర్వాత వైసీపీ యాక్టివ్ మోడ్‌లోకి వచ్చిందా? వైసీపీలోకి ఇద్దరు కీలక నేతలు రాబోతున్నారా? ఇన్నాళ్లు దూరంగా ఉన్న మాజీ ఎంపీలు ఇద్దరు నేతలు, వైసీపీని బలోపేతం చేయాలని డిసైడ్ అయ్యారా? ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

వైసీపీలోకి ఇద్దరు మాజీ ఎంపీలు? రాక ఎప్పుడంటే

Advertisement

వైసీపీ తీరు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఏపీలో అధికారం పోయి రెండేళ్లు గడుస్తోంది. కూటమికి ధీటుగా నిలబడి గట్టిగా పోరాటం చేయలేకపోతోంది. ఈ విషయంలో రెండు అడుగులు ముందుకు, మూడు అడుగులు వెనక్కి అన్నచందంగా వ్యవహరిస్తోందట ఆ పార్టీ. అధినేత జగన్‌కు ఎవరు చెప్పినా వినరని, ఆయన మనసుకు ఎలాంటి ఆలోచన వస్తే దాన్ని బయటకు పెడతారని అంటున్నారు.

ఫలితంగా పార్టీకి దెబ్బలు గట్టిగానే తగులుతున్నాయి. అందుకు ఎగ్జాంఫుల్ ‘మావిగన్’ వ్యవహారం. ఈ విషయంలో వైసీపీ ఇమేజ్ కిందకు పడిపోయింది. పరిస్థితి గమనిస్తున్న వైసీపీలోని కీలక నేతలు, ఇద్దరు మాజీ ఎంపీలతో మంతనాలు సాగిస్తున్నట్లు వైసీపీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది.

Advertisement

ఆ నేతలతో వైసీపీ మంతనాలు, మరో ఏడాది తర్వాత

ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరు? ఇద్దరు మాజీ ఎంపీలే. అందులో ఒకరు విజయసాయిరెడ్డి కాగా, మరొకరు ఉండవల్లి అరుణకుమార్. వీరిద్దరితో వైసీపీకి చెందిన కొందరు నేతలు రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్లు ఆ ఫీలర్ సారాంశం. అందులో నిజమెంతో తెలీదు. ఆ విధంగా ప్రచారం సాగుతోంది. ఇద్దరు నేతలతో చర్చల వెనుక జగన్ ఉన్నారా? లేదా? అనేది టాప్ సీక్రెట్.

ఆ మధ్య మీడియా ముందుకొచ్చిన విజయసాయిరెడ్డి ఓ విషయాన్ని బయటపెట్టారు. కూటమిని విడగొట్టకుంటే ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం కష్టమని తేల్చేశారు. అది నిజమేనని అంటున్నారు వైసీపీలోని కొందరు నేతలు. గతంలో 2014-19 మధ్య ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రావడం వెనుక వీఎస్ఆర్ స్కెచ్ మామూలుగా లేదని అంటున్నారు.

ALSO READ: మటన్ ముసుగులో గుర్రం మాంసం విక్రయం.. మంగళగిరిలో గుట్టురట్టు

ఆయన దౌత్యం వల్ల ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రావడం, ఆ తర్వాత ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం జరిగిపోయిందని అంటున్నారు. ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉందని అంటున్నారు. కూటమి సర్కార్ పెట్టుబడులను రప్పించడం చేస్తోందని అంటున్నారు. దాన్ని ఎదుర్కోవాలంటే వ్యూహాలు చాలా బలంగా ఉండాలని అంటున్నారు.

మరొకరు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్. ఆయన గురించి పెద్దగా చెప్పాల్సింది ఏమీ లేదు. వైఎస్ హయాం నుంచి ఆ ఫ్యామిలీతో మాంచి రిలేషన్ ఉంది. రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు కూడా.  ఆయనతో కూడా వైసీపీ పెద్దలు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.  ఆయన కూడా సాయిరెడ్డి చెప్పిన మాటలను దూతల వద్ద చెప్పినట్టు సమాచారం. మొత్తానికి మంతనాలు మాత్రం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీని గురించి రాబోయే రోజుల్లో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×