E-Paper
Advertisement

మీడియా రంగంలోకి ఎంట్రీ.. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన

మీడియా రంగంలోకి ఎంట్రీ..  మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన
Advertisement

Vijayasai Reddy: వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బాంబ్ పేల్చారు. రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన.. మీడియా రంగంలోకి వస్తున్నట్లు ప్రకటన చేశారు. త్వరలోనే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్ ను లాంచ్ చేయనున్నట్లు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఈ మీడియా.. బ్యాలెన్స్‌డ్, అన్‌బయాస్డ్, ట్రూత్‌కు కట్టుబడి ఉంటుందన్నారు. సాధారణ ప్రజలు, మహిళలు, యువత, రైతులు, కార్మికులు, పేదల సమస్యలపై పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ డిజిటల్ మీడియా సక్సెస్ అయిన తర్వాత తెలుగులో శాటిలైట్ న్యూస్ ఛానల్ ప్రారంభిస్తానని విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ ప్లాట్‌ఫామ్ పేరు త్వరలో ప్రకటిస్తామని స్టే ట్యూన్డ్ అంటూ పోస్టు పెట్టారు. విజయసాయి రెడ్డి ప్రకటనతో తెలుగు మీడియాలో చర్చ మొదలైంది.

రాజకీయాల నుంచి మీడియా వైపు

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నెంబర్ 2గా ఎదిగిన విజయసాయి రెడ్డి అనంతరం.. అనూహ్యంగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆయన టీడీపీ, బీజేపీలోకి వెళ్తున్నట్లు ప్రచారం జరిగినా.. రాజకీయాలకు గుడ్ బై రైతుగా మారారు. రాజకీయాలపై స్పందించడం కూడా తగ్గించారు. అయితే ఉన్నట్టుండి శనివారం ఎక్స్ వేదికగా సంచలన పోస్టు పెట్టారు. మీడియా రంగంలోకి వస్తున్నట్లు విజయసాయి రెడ్డి పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది.

స్వతంత్ర మీడియా

Advertisement

తెలుగు రాష్ట్రాల్లో పలు మీడియా సంస్థలు ఆయా రాజకీయ పార్టీలకు అనుబంధంగా పనిచేస్తుంటాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ పార్టీకి కొమ్ముకాయకుండా స్వతంత్రంగా పేదల పక్షాన పోరాడేందుకు మీడియా రంగంలోకి వస్తున్నట్లు విజయసాయి రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. యువత ఉపాధి అవకాశాలు, రైతు సమస్యలు, మహిళల భద్రత, సామాన్యుల హక్కులపై తమ ప్లాట్ ఫామ్ పోకస్ చేస్తుందని విజయసాయి రెడ్డి తెలిపారు.

Also Read: విజయసాయి‌రెడ్డి 2.0 యాక్టివేట్.. చెట్లకు ఓకే.. ఫ్యాన్ పార్టీకి స్ప్రే ఎప్పుడు?

Advertisement

 

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×