E-Paper
Advertisement

Vijayasai Reddy Daughter: విజయసాయిరెడ్డి కూతురికి షాక్.. అక్రమ కట్టడాలు కూల్చివేసిన అధికారులు

Vijayasai Reddy Daughter: విజయసాయిరెడ్డి కూతురికి షాక్.. అక్రమ కట్టడాలు కూల్చివేసిన అధికారులు
Advertisement

Vijayasai Reddy Daughter: ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జాకు గురైనట్టే. నదులు చుట్టూ మాత్రమే కాదు చివరకు సముద్రం చుట్టూ భూములను వదల్లేదు. తాజాగా విశాఖలోని భీమిలి బీచ్‌కు కూతవేటు దూరంలో వైపీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూతురు నేహారెడ్డి నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రహారీ నిర్మాణం చేపట్టారు. ఈ వ్యవహారం న్యాయస్థానం వరకు వెళ్లింది. చివరకు బుధవారం ఉదయం జీవీఎంసీ అధికారులు గోడను కూల్చివేశారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భీమిలి బీచ్‌పై కన్నేశారు ఆనాటి పాలకుల్లో కొంతమంది. అధికారం తమ చేతుల్లో ఉందని, తమను ఎవరు అడుగుతారనే ధీమాతో తీరానికి సమీపంలో గోడను కట్టేశారు వైపీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి కూతురు నేహారెడ్డి. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలను ఉల్లంఘించి మరీ కాంక్రీట్ గోడను నిర్మాణం చేశారు.

Advertisement

ALSO READ: బెజవాడ వరద.. బాధితుల ఆగ్రహం.. కొందరికే సాయం.. అడ్మినిస్ట్రేషన్ ఫెయిలైందన్న సీఎం చంద్రబాబు

ఈ వ్యవహారంపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీచ్ సమీపంలో కాంక్రీటు నిర్మాణాలకు అనుమతించవద్దని అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. ఈ క్రమం లో ఎంపీ కూతురికి ఈనెల రెండున జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. 24 గంటల్లో ఆక్రమణలు తొలగించాలని లేకుంటే తామే కూల్చివేస్తామని హెచ్చరించింది. అయినా పట్టించుకోలేదు. దీంతో బుధవారం ఉదయం జీవీఎంసీ అధికారులు కట్టిన గోడను కూల్చివేశారు.

Advertisement

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×