E-Paper
Advertisement

చేసిందంతా చేసి.. విజయసాయిరెడ్డికి ‘ఆర్థిక కష్టాలు’, ఆ రిపోర్ట్ ఆందోళనకరం

చేసిందంతా చేసి.. విజయసాయిరెడ్డికి ‘ఆర్థిక కష్టాలు’,  ఆ రిపోర్ట్ ఆందోళనకరం
Advertisement

Amaravati: వైసీపీ ఎగ్జిట్ నేత విజయసాయిరెడ్డి మరోసారి వార్తల్లోకి వచ్చేశారు. తన గురించి ప్రజలు మరిచి పోతారేమోనని భావించారో, తాను ఉన్నానని అప్పుడప్పుడు గుర్తు చేస్తున్నారు వీఎస్ఆర్. వైసీపీ ప్రభుత్వంలో చేసిందంతా చేసి చంద్రబాబు ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే పనిలో పడ్డారు. ఇంతకీ ఆయన సలహాలు ఇస్తున్నారా? లేకుంటే ఈ విధంగా చేయాలని వైసీపీ హైకమాండ్‌కు చెప్పే ప్రయత్నం చేస్తున్నారా?

కాగ్ నివేదికపై విజయసాయిరెడ్డి ప్రస్తావన

Advertisement

సమయం, సందర్భం, కేంద్రం రిపోర్టులు పట్టుకుని యాక్టివ్ అవుతున్నారు వైసీపీ ఎగ్జిట్ నేత విజయసాయిరెడ్డి. తాజాగా ఇప్పుడు అదే చేశారనుకోండి. ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను ఎక్స్ ద్వారా అందరితో షేర్ చేసుకుంటున్నారు వీఎస్ఆర్. దేశవ్యాప్తంగా పలు అంశాలపై ఆయన స్పందిస్తున్నారు.

వీలు చిక్కినప్పుడల్లా ఏపీ గురించి వీలైతే నాలుగు మాటలు లేకుంటే సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీకి సంబంధించిన రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలపై పోస్టులు పెడుతున్నారు. లేటెస్ట్‌గా ఏపీ ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వానికి సలహాలు ఇచ్చారు విజయసాయిరెడ్డి.

Advertisement

ఆ రిపోర్ట్ ఆందోళనకరం.. చంద్రబాబు ప్రభుత్వానికి సూచనలు

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై కాగ్ నివేదిక ఆందోళనకరంగా ఉందని రాసుకొచ్చారు విజయసాయిరెడ్డి. అన్ని రాష్ట్రాలతో పోల్చితే ఏపీ అత్యధికంగా రూ. 60,285 కోట్ల రెవెన్యూ లోటును నమోదు చేసిందన్నారు. ఏడాదిలో వారం తప్పితే అన్నిరోజులు ఆర్బీఏ రుణాలపై ఆధారపడిందన్నారు. ఆర్థిక వ్యవస్థ మళ్లీ సుస్థిరమైన మార్గంలోకి రావాలంటే కొన్ని సూచనలు చేశారు.

ఆర్థిక కార్యకలాపాలను పెంచాలని ప్రస్తావించారు. మరొకటి అనవసర ఖర్చులను అరికట్టాల్సిన అవసరం ఉందని నొక్కి వక్కానించారు. ఇంతకీ కాగ్ నివేదికలోని అంశాలేంటి? దేశంలోని 16 రాష్ట్రాలు 2024-25 ఏడాదిలో ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌలభ్యాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వినియోగించుకున్నాయి.

ALSO READ: సాయికృష్ణ అదృశ్యం కేసు కొత్త మలుపు.. సిఐ నాగరాజుని అరెస్ట్ చేయవద్దని ఆందోళన, ప్రభుత్వం సిట్ ఏర్పాటు

అందులో పంజాబ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు 62 శాతం వినియోగించుకున్నట్లు తేలింది. పంజాబ్‌‌ ప్రభుత్వం ఏడాది పొడువునా ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌలభ్యాన్ని వినియోగించుకుందని తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్‌ కేవలం వారం తప్ప అన్నిరోజులు చేబదుళ్ల రూపంలో ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని తీసుకున్నట్లు ప్రస్తావించింది.

2024-25లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేబదులు రూపంలో రూ. 1,72,532 కోట్లు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌‌తో పాటు 12 రాష్ట్రాల ప్రభుత్వాలు పింఛన్ల కోసం ఖర్చు పెడుతున్న మొత్తం కన్నా అప్పులపై వడ్డీ చెల్లింపులకే ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు తేలింది. కాగ్ నివేదికలోని ఈ అంశాలను విజయసాయిరెడ్డి ప్రస్తావించారు.

దీనిపై ఎక్స్ వేదికగా వీఎస్ఆర్‌కు కౌంటర్లు పడిపోతున్నాయి. ఆంధ్ర‌ప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని అంటున్నారు. దక్షిణాదిలో స్థిరపడిన రాష్ట్రాలతో పోల్చడం సరికాదని అంటున్నారు. కాగ్ నివేదిక ఎన్నికల ఏడాది నాటిదని గుర్తు చేస్తున్నారు. అప్పుడు నాలుగైదు నెలలు వైసీపీ ప్రభుత్వం అధికారంలోని ఉందని గుర్తు చేస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వంలో జల్సాలు చేసినప్పుడు ఆర్థిక పరిస్థితి గుర్తుకు రాలేదా? అంటూ ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. ఇప్పుడు CAG నివేదికలో ఆర్థిక లోటు, ఆర్థిక వృద్ధి, వృథా ఖర్చుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. రాజకీయం అనుకూలంగా ఉన్నప్పుడు ఆర్థిక బాధ్యత గుర్తుకు రాదా? అంటూ పలువురు ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. ఈ విధంగా ప్రశ్నించాలని వైసీపీ హైకమాండ్‌కు వీఎస్ఆర్ సలహాలు ఇస్తున్నారని అంటున్నారు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×