E-Paper
Advertisement

Varra Ravindra Reddy: ష‌ర్మిల‌, సునీత‌, విజ‌య‌మ్మ‌పై అనుచిత పోస్టులు పెట్టాం.. రిమాండ్ రిపోర్ట్ లో వ‌ర్రా ర‌వీంద్ర రెడ్డి!

Varra Ravindra Reddy: ష‌ర్మిల‌, సునీత‌, విజ‌య‌మ్మ‌పై అనుచిత పోస్టులు పెట్టాం.. రిమాండ్ రిపోర్ట్ లో వ‌ర్రా ర‌వీంద్ర రెడ్డి!
Advertisement

వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్ట్ వ‌ర్రా ర‌వీంద్ర‌రెడ్డి పోలీసుల అదుపులో ఉన్న సంగ‌తి తెలిసిందే. సోష‌ల్ మీడియాలో అనుచిత పోస్టులు చేశార‌ని వ‌ర్రా రవీంద్ర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా మంగ‌ళ‌వారం అత‌డిని అద‌న‌పు మెజిస్ట్రేట్ ఎదుట హాజ‌రుప‌రిచారు. విచార‌ణ అనంత‌రం 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ నేప‌థ్యంలో రిమాండ్ రిపోర్ట్‌లో వర్రా రవీంద్ర‌రెడ్డి సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌టపెట్టారు. ఐప్యాక్ టీమ్‌ కంటెంట్ ఇస్తే ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసేవాళ్ళమ‌ని చెప్పారు.

Also read: ప్రశ్నిస్తే ఖేల్ ఖతమా? మీకు భయపడాలా? మీరు మాత్రం పవిత్రులా? పోసాని సీరియస్

Advertisement

వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడేవారిని లక్ష్యంగా చేసుకుని నాయకులు, వారి కుటుంబ సభ్యులపై పోస్టులు పెట్టేవాళ్ళమ‌ని అన్నారు. వైసీపీ సోష‌ల్‌మీడియా బాధ్య‌త‌లు సజ్జల భార్గవరెడ్డి తీసుకున్న త‌ర‌వాత‌ మరింత రెచ్చిపోయామ‌ని చెప్పారు. జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలని భార్గవరెడ్డి బెదిరించాడని అన్నారు. 2023 నుండి త‌న ఫేస్‌బుక్ ఐడీతో భార్గవరెడ్డి పోస్టులు పెట్టాడని తెలిపాడు. షర్మిల, సునీత, విజయమ్మపై అసభ్యకర పోస్టులు పెట్టామ‌ని ఒప్పుకున్నారు. ఆ పోస్టులు పెట్టాలని అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి త‌మకు కంటెంట్ ఇచ్చారని అన్నారు.

వైసీపీ సోషల్ మీడియాలో భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి, సుమారెడ్డి కీలకంగా ఉన్నార‌ని వెల్ల‌డించారు. దీంతో వైసీపీ సోషల్ మీడియానే మాజీ సీఎం, పార్టీ అధినేత జ‌గ‌న్ కుటుంబ స‌భ్యుల‌పై పోస్టులు పెట్ట‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇదిలా ఉంటే సోష‌ల్ మీడియాలో అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం, అస‌భ్య కామెంట్లు చేసిన వారిపై టీడీపీ స‌ర్కార్ క‌న్నేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే గ‌త ప్ర‌భుత్వంలో, ప్ర‌భుత్వం మారిన త‌ర‌వాత సోష‌ల్ మీడియాలో మ‌హిళ‌ల‌పై అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించిన వారిని క‌ట‌క‌టాల్లోకి నెట్టేస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×