E-Paper
Advertisement

Vijayawada Politics: రాజకీయాల్లోకి వస్తే వంగవీటి మార్క్ చూపిస్తా.. రంగా కూతురు సంచలనం

Vijayawada Politics: రాజకీయాల్లోకి వస్తే వంగవీటి మార్క్ చూపిస్తా.. రంగా కూతురు సంచలనం
Advertisement

Vijayawada Politics: త్వరలో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. వంగవీటి రంగా ఫ్యామిలీ నుంచి మరొకరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు రంగా కూతురు ఆశా కిరణ్ ఓ ప్రకటన చేశారు. ఇంతకీ ఆమె ఏ పార్టీలోకి వెళ్లనున్నారు? టీడీపీ లేదా వైసీపీ లేకుంటే జనసేన, బీజేపీలోకి వస్తున్నారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

రాజకీయాల్లోకి రంగా కూతురు ఆశా

Advertisement

విజయవాడలో వంగవీటి రంగా ఫ్యామిలీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నవంబర్ 16న ఉదయం విజయవాడలోని బందర్ రోడ్డులోగల వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించింది ఆయన కూతురు ఆశా కిరణ్. ఉన్నట్లుండి ఆశాకిరణ్ పబ్లిక్ లైఫ్‌లోకి రావడంతో రాజకీయ ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించారు.

ప్రస్తుతం పాలకొల్లులో వన భోజనాలకు వెళ్తున్నట్లు వెల్లడించింది.   రాజకీయాల ఎంట్రీపై తాను ప్రకటన చేయడం లేదని,  దాని కోసం మరోసారి మాట్లాడుతాని చెప్పే ప్రయత్నం చేసింది.  రాధ-రంగా మిత్ర మండలిలో గ్యాప్ ఉందని, అందరినీ ఒక తాటిపైకి తీసుకురావడం కోసం బయటికి వచ్చానని మనసులోని మాట బయటపెట్టింది.

Advertisement

వేడెక్కిన బెజవాడ రాజకీయాలు

ఇంకా ఏ పార్టీలోకి వెళ్లాలనే దానిపై నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. మా ఇద్దరి బాటలు వేరైనా ఆశయం ఒకటేనని తేల్చేసింది.  రంగా ఆశయ సాధనాన్ని ముందుకు తీసుకెళ్లడమేనని తెలియజేసింది.  ఇన్నాళ్లు కుటుంబ బాధ్యతల కారణంగా బయటకు రాలేదని పేర్కొంది. ఇకపై పబ్లిక్ లైఫ్‌లో ఉంటానని, రంగా అభిమానులను కలుస్తానని వెల్లడించింది.

ఎవరికి ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని చెప్పే ప్రయత్నం చేసింది. రంగా అన్ని కులాలకి చెందినవారని, తాను కూడా అంతేనని చెప్పుకొచ్చింది వంగవీటి ఆశా కిరణ్. ప్రస్తుతం వంగవీటి రాధా దుబాయ్ పర్యటనలో ఉన్నట్లు  ఆయన అభిమానులు చెబుతున్నారు.

ALSO READ: ఏపీకి భారీగా పెట్టుబడులు.. ఇప్పటివరకు ఎన్ని లక్షల కోట్లంటే.. 

పేద, బడుగు, బలహీన వర్గాల వారికి అండగా ఉండడమే ధ్యేయమన్నారు ఆశా కిరణ్. పబ్లిక్ లైఫ్‌లోకి ఇవాళ నుంచి ఎంట్రీ ఇచ్చానని, ఆరంభం మాత్రమేనని తెలిపింది.  ఏమైనా పార్టీలు మిమ్మల్ని సంప్రదించాయా? అన్న ప్రశ్నకు ఆమె నేరుగా సమాధానం ఇవ్వలేదు.  ఇది రాజకీయ ఎజెండా కాదని, దయచేసి పాయింట్‌ని డైవర్ట్ చేయవద్దని కోరింది.

జనసేన తప్పితే మిగతా ప్రధాన పార్టీలు ఆమెని సంప్రదించినట్టు విజయవాడలో ఓ వార్త గుప్పుమంది. దీనిపై ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వలేదని,  ప్రకటన చేసిన తర్వాత ఏ పార్టీ అన్నది చెబుతానని తప్పించుకునే ప్రయత్నం చేశారట ఆశాకిరణ్. మొత్తానికి రాజకీయ నాయకుల మాదిరిగా మాట్లాడింది ఆశా కిరణ్.

 

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×