E-Paper
Advertisement

Fire To Chilli Crop : పల్నాడు జిల్లాలో దుండగులు దుశ్చర్య.. మిరప పంటకు నిప్పు..

Fire To Chilli Crop :  పల్నాడు జిల్లాలో దుండగులు దుశ్చర్య.. మిరప పంటకు నిప్పు..
Advertisement

Fire To Chilli Crop : పల్నాడు జిల్లా గురజాల మండలం పల్లెగుంటలో మిర్చి పంటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. పంట తగలబడటంతో రూ. 2.5 లక్షల ఆస్తి నష్టం కలిగిందని రైతు కన్నీటి పర్యంతమయ్యారు.

పల్లెగుంటలో దీకొండ రమణ మిర్చి పంట సాగు చేశారు. మిర్చిని కల్లంలో ఆరబోసి రాత్రి ఇంటికి వెళ్లారు. ఉదయం వచ్చి చూసే సరికి పంట దగ్ధమైంది. దీంతో ఆ రైతు భావోద్వేగానికి లోనయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించటంతో కల్లంలో ఆరబోసిన 15 క్వింటాళ్ల ఎండు మిర్చి పూర్తిగా కాలి బూడిదైందని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

రాత్రి సమయంలో దుండగులు ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని బాధితుడు రమణ అనుమానం వ్యక్తం చేశారు. తనకు తగిన న్యాయం జరిగేలా చూడాలని బాధిత రైతు ప్రభుత్వానికి వేడుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×