E-Paper
Advertisement

కర్నూలులో రాత్రి హైటెన్షన్.. బ్యాడ్మింటన్ అకాడమీ వద్ద గాల్లో కాల్పులు.. భయాందోళనలో స్థానికులు

కర్నూలులో రాత్రి హైటెన్షన్.. బ్యాడ్మింటన్ అకాడమీ వద్ద గాల్లో కాల్పులు.. భయాందోళనలో స్థానికులు
Advertisement

Kurnool: కర్నూలు పట్టణంలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. బ్యాడ్మింటన్ అకాడమీ సమీపంలో ఇద్దరు దుండగులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఉన్నట్లుండి గన్ శబ్దాలు వినిపించడంతో ఒక్కసారిగా స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పోలీసుల అదుపులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అసలు ఏం జరిగింది?

కర్నూలులో రాత్రి హైటెన్షన్- కర్నూలులో జోహరపురంలో ఆదివారం సాయంత్రం స్థానిక బ్యాడ్మింటన్ అకాడమీ వద్దకు వచ్చారు. కారులోని దిగిన గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు గన్‌తో ఒక్కసారిగా గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటన రాత్రి సుమారు 8.30 గంటలకు జరిగింది. గన్ శబ్దాలకు స్థానికులు కేకలు వేశారు. వెంటనే దుండగులు తమ కారులో అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Advertisement

బ్యాడ్మింటన్ అకాడమీ వద్ద గాల్లో కాల్పులు- ప్రత్యక్ష సాక్షులు సమాచారం ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి ఎలాంటి హెచ్చరిక లేకుండా గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారని తెలిపారు. స్థానికులు గుంపుగా అక్కడికి చేరుకుని దుండగులు పట్టుకున్నారు. ఈలోగా కర్నూలు మూడో టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చిన తర్వాత స్థానికులు వారిని అప్పగించారు. ఇద్దరు దుండగులను అదుపులోకి తీసుకున్నారు.

భయాందోళనలో స్థానికులు- అలాగే ఘటనలో ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు ఎందుకు జరిపారు? ఆయుధానికి చట్ట బద్ధమైన లైసెన్స్ ఉందో లేదో నిర్ధారించడానికి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. దీని వెనుక ఉన్నవారెవరు అనేదానిపై దర్యాప్తు మొదలుపెట్టారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

Advertisement

ALSO READ:  రోజాకు పోలీసులు నోటీసులు.. వైసీపీ నేతలకు షాక్, బెదిరింపులకు భయపడేది లేదు-రోజా

పోలీసుల అదుపులో ఇద్దరు-ప్రాథమిక విచారణ తర్వాత అధికారిక ప్రకటన విడుదల చేస్తామని కర్నూలు పోలీసులు వెల్లడించారు. కాల్పులు జరిగిన సమయంలో పరిశ్రమల శాఖ మంత్రి అకాడమీలో ఉన్నారన్న వదంతులను స్థానికులు ఖండించారు. ఘటన జరిగిన సమయంలో సదరు మంత్రి హైదరాబాద్‌లో ఉన్నారని అంటున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×