E-Paper
Advertisement

Vaikunta Dwara Darshan: నెరవేరిన బాధితుల కోరిక.. తిరుమలలో స్పెషల్‌గా వైకుంఠ దర్శనం

Vaikunta Dwara Darshan: నెరవేరిన బాధితుల కోరిక.. తిరుమలలో స్పెషల్‌గా వైకుంఠ దర్శనం
Advertisement

Vaikunta Dwara Darshan: తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే చేసిన పాపాలు కొంతైనా తొలగుతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే సుదూర ప్రాంతాల నుంచి దర్శించుకునేందుకు భక్తులు ఏడు కొండలకు వస్తుంటారు. ఈ క్రమంలో అనుకోని ఘటనలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి తిరుపతి టికెట్ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన బాధితులు స్పెషల్‌గా వైకుంఠ ద్వారం ద్వారా దేవ దేవుడ్ని దర్శించుకున్నారు.

తిరుపతిలో వైకుంఠ దర్శన టికెట్ల కేంద్రాల వద్ద జరగిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. దాదాపు 40 మందికి పైగా గాయపడ్డారు. వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందారు. స్వయంగా సీఎం చంద్రబాబు బాధితులతో మాట్లాడారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

Advertisement

శుక్రవారం వైకుంఠం ద్వారా స్వామిని దర్శించుకుంటామని చెప్పడంతో అందుకు సంబంధించి ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఉదయం ఏడు గంటలకే క్షతగాత్రులకు వైకుంఠ ద్వారం దర్శనం చేయించింది టీటీడీ. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు దర్శనం తర్వాత బాధితులు ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

తాము ఎనిమిది సార్లు ఇక్కడకు వచ్చామని, అనుకోకుండా ఇలాంటి ఘటన జరిగింద న్నారు బాధితులు. ఎప్పుడూ ఈ విధంగా జరగలేదన్నారు. దీనికి ఎవరు బాధ్యులు కారన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు ప్రత్యేకంగా వైకుంఠం ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకునే భాగ్యం కల్పించారన్నారు. ముఖ్యమంత్రి మొదలు అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తాము బతికామంటే స్వామి దయవల్లేనని చెప్పుకొచ్చారు బాధితులు.

Advertisement

ALSO READ: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం.. టీటీడీ కీలక ప్రకటన ఇదే!

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×