// // ttd ex chairman yv subbareddy condemns chandrababu naidu comments on tirupati laddu - దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా? -->
E-Paper
Advertisement

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?
Advertisement

తిరుపతి లడ్డూ దేశంలో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్. ఎవరు తిరుపతి వెళ్లినా లడ్డు తీసుకుని బంధువులకు, శ్రేయోభిలాషులకు పంచుతారు. ఆ లడ్డు టేస్టే వేరు. తిరుపతి దేవుడిపై భక్తితోపాటు లడ్డూ టేస్ట్‌పై మక్కువతో ఎక్కువగా లడ్డూను తీసుకుంటారు. తిరుపతి ప్రసాదానికి క్రేజ్ మామూలుగా ఉండదు. అలాంటి తిరుపతి లడ్డూ పై సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఉభయ రాష్ట్రాల్లోని ప్రజలను విస్మయానికి లోనుచేశాయి.

తిరుమలలోని శ్రీవారి ప్రసాదంపైలో జంతువుల కొవ్వు వాడారంటూ సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలో నాణ్యత లేని పదార్థాలతో తిరుపతి లడ్డూలను తయారు చేశారని ఆరోపించారు. తిరుపతి పుణ్యక్షేత్ర పవిత్రతనే దెబ్బ తీశారని ఆగ్రహించారు. అన్నదానంలోనూ నాణ్యత లేకుండా చేశారని, దేవుడి దగ్గర పెట్టే ప్రసాదాలనూ అపవిత్రం చేశారంటూ విరుచుకుపడ్డారు.

Advertisement

ఈ వ్యాఖ్యలపై వైసీపీ ఘాటుగా స్పందించింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సీరియస్ చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. దివ్యక్షేత్రమైన తిరుమల పవిత్రతను, వందల కోట్ల మంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు నాయుడు దెబ్బతీసి పెద్ద పాపమే చేశాడని ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. తిరుమల ప్రసాదాంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమైనవని ఖండించారు. మనిషి పుట్టుక పుట్టినవారెవ్వరూ ఇలాంటి మాటలు మాట్లాడరని మండిపడ్డారు. ఇలాంటి ఆరోపణలూ చేయరని పేర్కొన్నారు.

Also Read: Tollywood: జానీ మాస్టర్ కన్నా ముందు టాలీవుడ్‌లో లైంగిక వేధింపులకు పాల్పడిన సెలబ్రిటీలు ఎవరో తెలుసా.. ?

Advertisement

రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు నాయుడు ఎంతటి నీచానికైనా దిగజారుతారని ఆయన మరోమారు నిరూపించుకున్నారని విమర్శించారు. భక్తుల విశ్వాసాన్ని బలపరిచడానికి తిరుమల ప్రసాదం విషయంలో తాను, తన కుటుంబం ఆ దేవ దేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మరి చంద్రబాబు కూడా నత కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా? అంటూ సవాల్ చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు టీటీడీ చైర్మన్‌గా చేసిన వైవీ సుబ్బారెడ్డి ఈ మేరకు ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×