E-Paper
Advertisement

టీటీడీ బోర్డు సంచలన నిర్ణయాలు.. సామాన్య భక్తులకు గుడ్ న్యూస్.. దాతల దర్శనాల్లో కీలక మార్పులు!

టీటీడీ బోర్డు సంచలన నిర్ణయాలు.. సామాన్య భక్తులకు గుడ్ న్యూస్.. దాతల దర్శనాల్లో కీలక మార్పులు!
Advertisement

TTD Reforms: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తాజాగా భక్తుల సౌకర్యాలు, ఆలయ పాలనా విభాగాల్లో పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో, సాధారణ భక్తుల దర్శన వేళలను మెరుగుపరచడంతో పాటు దాతల సేవా నిబంధనల్లో పారదర్శకతకు పెద్దపీట వేశారు. విరాళాల నిర్వహణలో ఏకరీతి విధానాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కొత్త మార్పులను ప్రవేశపెట్టారు.

భక్తుల సౌకర్యాలు,మౌలిక వసతులు..

Advertisement

తిరుమలలో సర్వదర్శనం కోసం వేచి ఉండే భక్తులకు ఊరటనిస్తూ రూ.6.31 కోట్లతో ఆళ్వార్ ట్యాంక్ సమీపంలో శాశ్వత షెల్టర్లు, క్యూలైన్లు, ఆధునిక మరుగుదొడ్ల నిర్మాణానికి టెండర్లు ఆమోదించారు. అలాగే, ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు కుమారధార, పసుపుధార డ్యామ్‌ల వద్ద రూ.2.77 కోట్లతో డబుల్ లేన్ వంతెనను నిర్మించనున్నారు. పాతపడిపోయిన ఘన వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధి చేసేందుకు రూ.5 కోట్లు, భక్తుల రక్షణ కోసం ఆలయాలు, వసతి గృహాల్లో అగ్నిమాపక వ్యవస్థల నిర్వహణకు రూ.2.35 కోట్లు కేటాయించారు. టి.బి.సి, ఎ.టి.సి ప్రాంతాల్లోని 12 పాత భవనాలను తొలగించి, దాతల సాయంతో కొత్తవి నిర్మించనున్నారు.

దాతల నిబంధనలు ..

Advertisement

టీటీడీ ట్రస్టులకు విరాళాలిచ్చే దాతల ప్రివిలేజెస్‌లో మార్పులు చేశారు. ఇకపై దాతలకు ఏడాదికి ఒకసారి మాత్రమే బ్రేక్ దర్శనం లభిస్తుంది. అయితే, పాత దాతలకు పాత నిబంధనలే వర్తిస్తాయి. తిరుమల ఎస్వీ మ్యూజియం నిర్వహణ బాధ్యతలను టాటా సంస్థకు అప్పగించాలని బోర్డు నిర్ణయించింది. అలాగే, 12 ఏళ్లు పైబడిన సందర్శకులకు రూ.50 ప్రవేశ రుసుమును ఖరారు చేశారు.

Also Read: ఏపీ రాజకీయాల్లో పెను విషాదం.. ముద్రగడ పద్మనాభం కన్నుమూత

వేద పండితులు, కళాకారులకు ప్రోత్సాహం..

ధార్మిక ప్రచారాన్ని మరింత బలోపేతం చేస్తూ, వేద పారాయణ స్కీం కింద 791 మందిని సంభావన వేద పండితులుగా నియమించనున్నారు. వీరు రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో నిత్య వేద పారాయణం చేస్తారు. దీనితో పాటు హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య, దాస సాహిత్య ప్రాజెక్టుల కళాకారుల పారితోషికాన్ని వారి నైపుణ్యం ఆధారంగా పెంచనున్నారు. టీటీడీ క్యాంటీన్లలోని 65 సర్వర్ పోస్టులను క్యాటరింగ్ సూపర్‌వైజర్లుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు.

ఇతర ఆలయాల అభివృద్ధి..

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయ మూలవిరాట్లకు బంగారు కవచాల తయారీ కోసం టీటీడీ ట్రెజరీ నుంచి 1,000 గ్రాముల బంగారాన్ని కేటాయించారు. అలాగే అక్కడ రూ.17.84 కోట్లతో 100 గదుల వసతి గృహాన్ని, ఈశాన్య మాడవీధి విస్తరణకు రూ.2.11 కోట్ల భూసేకరణ వ్యయాన్ని ఆమోదించారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ ముఖమండపంపై ‘సాలహారం’ నిర్మాణానికి రూ.2.50 కోట్లు మంజూరు చేశారు. భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా 2027 నాటికి 10 లక్షల డైరీలు, 14.25 లక్షల క్యాలెండర్ల ముద్రణకు కూడా బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


టీటీడీలోని వివిధ ట్ర‌స్టులు, స్కీమ్‌ల‌కు విరాళాలు ఇచ్చే దాత‌ల‌కు క‌ల్పిస్తున్న ప్రివిలేజెస్‌లో టిటిడి ప‌లు మార్పులు చేసింది.
తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నం లో చైర్మన్ బి ఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ బోర్డు స‌మావేశం జ‌రిగింది. బోర్డు తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మ‌న్ ఈవోతో కలిసి మీడియా కు వివరించారు. టీటీడీకి చెందిన అన్ని ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే దాతలకు కల్పించే ప్రివిలేజెస్‌లో పలు మార్పులు చేపట్టింది. కొత్త నిబంధనలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయ‌ని టిటిడి ప్రకటించింది.  అయితే, ఇప్పటికే వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించిన దాతలకు ప్రస్తుతం అమలులో ఉన్న ప్రివిలేజెస్ యథావిధిగా కొనసాగుతాయ‌ని స్పష్టం చేసింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×