E-Paper
Advertisement

Kadapa Crime: మిగ్ జాం ఎఫెక్ట్.. చెట్టుకూలి కానిస్టేబుల్ మృతి

Kadapa Crime: మిగ్ జాం ఎఫెక్ట్.. చెట్టుకూలి కానిస్టేబుల్ మృతి
Advertisement

Kadapa Crime: ఏపీలో మిగ్ జాం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. భారీ, అతిభారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో పంటలు నేలకొరిగి, నీటమునగడంతో రైతన్నకు మళ్లీ అపార నష్టం వాటిల్లింది. చెట్లు నేలకొరిగి, విద్యుత్ స్తంభాలు దెబ్బతినడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మధ్యాహ్నానికి బాపట్ల వద్ద తీరం దాటుతుందని, ఆ సమయంలో తుపాను బీభత్సం సృష్టిస్తుందని హెచ్చరిస్తున్నారు.

తుపాను బీభత్సానికి ఒక కానిస్టేబుల్ ప్రాణం కోల్పోయాడు. వైఎస్సార్ కడప జిల్లా భాకరాపేటలో విధులు నిర్వహిస్తున్నట్లు కానిస్టేబుల్ పై చెట్టు విరిగిపడి దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే.. భాకరాపేట సమీపంలో మలినేనిపట్నం వద్ద కానిస్టేబుల్ సత్యకుమార్ బైక్ పై వెళ్తున్నాడు. ఒకవైపు భారీ వర్షం.. మరోవైపు ఈదురుగాలులు.. అదే సమయంలో సత్యకుమార్ పై చెట్టు విరిగిపడింది. దాంతో అతను అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

Advertisement

సత్యకుమార్ 2004వ బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ గా గుర్తించారు. సత్యకుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. సత్యకుమార్ అకాల మరణంతో.. కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×