E-Paper
Advertisement

Marriage Bureau Fraud: ప్రేమ, పెళ్లి అని చెప్పి చివరికి.. విశాఖలో మ్యారేజ్ బ్యూరోల అరాచకం

Marriage Bureau Fraud: ప్రేమ, పెళ్లి అని చెప్పి చివరికి.. విశాఖలో మ్యారేజ్ బ్యూరోల అరాచకం
Advertisement

Marriage Bureau Fraud: విశాఖలో మ్యారేజ్ బ్యూరో పేరుతో అరాచకాలకు పాల్పడుతుందోముఠా. పెళ్లి కానీ యువతులే టార్గెట్‌గా దుండగులు ఆగడాలకు పాల్పడుతున్నారు. మత్తుమందు ఇచ్చి అత్యాచారాలు చేస్తున్నారు. బాధితులు స్పృహ కోల్పోయిన సమయంలో.. వీడియోలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మ్యారేజ్ బ్యూరో, హెర్బల్ ప్రొడక్ట్స్, ర్యాపిడో పేరిట దుండగులు అమ్మాయిల వివరాలు సేకరిస్తున్నారు. గర్భం దాల్చిన బాధితురాలికి గుట్టు చప్పుడు రాకుండా అబార్షన్ చేయిస్తున్నారు.

తాజాగా విశాఖలో మ్యారేజ్‌ బ్యూరో మాటున లైంగిక వేదింపులకు పాల్పడుతున్న యువకుడి ఘటన వెలుగు చూసింది. కంచరపాలెంకు చెందిన రవీంద్ర యాదవ్ అనే వ్యక్తి తనను మోసం చేశాడని సోషల్ మీడియా వేదికగా ఓ యువతి ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement

రవీంద్ర యాదవ్ తల్లిదండ్రులు కంచరపాలెంలో వివాహ వేదిక పేరుతో మ్యారేజ్‌ బ్యూరో నడుపుతున్నారు. వివాహ వేదికకు వచ్చే అమ్మాయిలను.. రవీంద్ర యాదవ్‌ ట్రాప్ చేసి, ప్రేమ పేరుతో మోసం చేస్తున్నాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. పరిచయమైన యువతులకు కాల్ చేసి వీడియో కాల్‌లో న్యూడ్‌గా మాట్లాడాలని రవీంద్ర యాదవ్ బెదిరిస్తున్నట్టు ఆరోపించింది. రవీంద్ర యాదవ్‌ అకృత్యాలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో తాను మాట్లాడిన వీడియో విడుదల చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది బాధిత యువతి.

ఈ తరుణంలో విశాఖలో నలుగురు మ్యారేజ్‌ బ్యూరో నిర్వాహకులపై కేసు నమోదు చేశారు పోలీసులు. మ్యారేజ్ బ్యూరో మాటున అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఓ యువతి ఫిర్యాదు చేయడంతో.. రవీంద్ర యాదవ్, అతని తండ్రి, మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోర్త్ పోలీస్ స్టేషన్‌‌లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు రవీందర్ యాదవ్‌‌ను శ్రీకాళంలో అరెస్ట్ చేసి ఫోర్త్ టౌన్‌‌ పోలీస్ స్టేషన్‌‌కి తరలించినట్లు సమాచారం.

Advertisement

Also Read: ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఆ తేదీలు మరిచిపోవద్దు

ప్రేమ, పెళ్లి పేరుతో తనను మోసం చేశారని.. పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని, అబార్షన్‌ చేయించాడని రవీంద్ర యాదవ్‌పై ఫిర్యాదు చేసింది. వివాహ వేదికకు వచ్చే అమ్మాయిలను రవీంద్ర యాదవ్‌ ట్రాప్ చేసి ప్రేమ పేరుతో మోసం చేస్తున్నాడని యువతి ఆరోపిస్తోంది. తనతో పాటు మరో 30 మంది అమ్మాయిలను మోసం చేయడమే కాకుండా న్యూడ్ వీడియోస్ సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×