E-Paper
Advertisement

Train Derailment : యుద్ధప్రాతిపదికన ట్రాక్ పునరుద్ధరణ.. రంగంలోకి హెవీ డ్యూటీ క్రేన్స్

Train Derailment : యుద్ధప్రాతిపదికన ట్రాక్ పునరుద్ధరణ.. రంగంలోకి హెవీ డ్యూటీ క్రేన్స్
Advertisement

Train Derailment : విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం తర్వాత ట్రాక్‌ పునరుద్దరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. ప్రతి నిమిషం ముఖ్యమే అన్నట్టుగా దూసుకుపోతున్నాయి రెస్క్యూ టీమ్స్‌.ఇప్పటికే ప్రమాదం జరిగి 15 గంటలు దాటడంతో వెంటనే ట్రాక్‌ను పునురుద్దరించి ట్రాక్‌పై మళ్లీ రైళ్ల పరుగులను ప్రారంభించాలని చూస్తోంది రైల్వే శాఖ. రెండు రైళ్లు ఢీకొనడం.. బోగీలు పక్కనే ఉన్న గూడ్స్‌ రైలుపై పడటంతో రెండు ట్రాక్‌లపై రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

ఇప్పటికే డ్యామేజ్‌ అయిన బోగీలు కాకుండా మిగిలిన బోగీలను అక్కడి నుంచి తరలించారు. ఇక డ్యామేజ్‌ అయిన బోగీలను ట్రాక్‌పై నుంచి తొలగించే పనులను ప్రారంభించారు. హేవీ డ్యూటీ క్రేన్లను రంగంలోకి దింపారు. బోగీలను పక్కకు తప్పించి ట్రాక్‌ను పునరుద్దరిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే మొదట క్షతగాత్రులను బయటికి తీయడం.. ఆసుపత్రులకు పంపడంపై దృష్టి పెట్టిన రైల్వేశాఖ.. ఆ తర్వాత అసలు పనులను మొదలు పెట్టిందనే చెప్పాలి.

Advertisement

ఇప్పటికే 14 రైళ్లను రద్దు చేసిన రైల్వేశాఖ.. మరో ఐదు రైళ్ల దారిని మళ్లించింది. ప్రస్తుతం NDRF, ఏపీ స్టేట్‌ DRF సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. మరోవైపు రైల్వేశాఖ ట్రాక్‌పై పూర్తిగా దృష్టి పెట్టింది. సిగ్నలింగ్, హైటెన్షన్‌ వైర్‌, కొత్త ట్రాక్‌ను ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయి. మరికొన్ని గంటల్లో ఈ ట్రాక్‌పై రైళ్లను పరిగెత్తిస్తామని చెబుతున్నారు రైల్వే అధికారులు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×