E-Paper
Advertisement

Tirumala News: తిరుమలలో విషాదం.. తొక్కిసలాటలో భక్తురాలి మృతి..

Tirumala News: తిరుమలలో విషాదం.. తొక్కిసలాటలో భక్తురాలి మృతి..
Advertisement

Tirumala News: తిరుపతిలో  విషాదం చోటుచేసుకుంది. ఈనెల 10న వైకుంఠ ఏకాదశి ని పురస్కరించుకొని టీటీడీ సిబ్బంది వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు ఇస్తోంది.  ఈ నెల 10 నుంచి 12 వరకు గాను టోకెన్ల ప్రక్రియ ప్రారంభించింది. అయితే దర్శన టోకెన్ల కోసం పెద్ద ఎత్తున భక్తులు టీటీడీ కేటాయించిన కేంద్రాల వద్దకు పోటెత్తారు. ఈ క్రమంలో తిరుపతి బస్టాండ్ సమీపంలోని విష్ణు నివాసం వద్ద తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో మల్లిక అనే మహిళ మృతి చెందింది. మరో ఆరుగురి భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

తోపులాటలో మల్లిక తొలుత తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే అక్కడి టీటీడీ సిబ్బంది స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.  అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలిని తమిళనాడుకు చెందిన మల్లికగా పోలీసులు గుర్తించారు.  గాయాల పాలైన ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు తిరుపతిలోనే ఏర్పాటు చేసిన బైరాగి పట్టెడలోని రామానాయుడు పాఠశాల వద్ద కూడా తొక్కిసలాట చోటుచేసుకుంది.

Advertisement

Also Read: IITGN Jobs: బీటెక్ పాసైన వారికి శుభవార్త.. ఈ ఉద్యోగం కొడితే నెలకు RS.2,00,000 పైనే..

మరోవైపు టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనం ఉంటుందని ఇదివరకే టీటీడీ చెప్పిన విషయం తెలిసిందే. ఈనెల 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్న విషయం తెలిసిందే.  తిరుమలలో మొత్తం మూడు ప్రాంతాల్లో తొక్కిసలాట జరిగింది. తోపులాట గాయపడిన భక్తులను రుయా ఆస్పత్రికి తరలించారు. దీనిపై మరింత సమాాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

 

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×