E-Paper
Advertisement

Tirupati laddu adulteration Inquiry: శ్రీవారి లడ్డూ కల్తీపై సీబీఐ సిట్ ఏం తేల్చేంది, సుప్రీంకోర్టుకు ప్రైమరీ రిపోర్టు

Tirupati laddu adulteration Inquiry: శ్రీవారి లడ్డూ కల్తీపై సీబీఐ సిట్ ఏం తేల్చేంది, సుప్రీంకోర్టుకు ప్రైమరీ రిపోర్టు
Advertisement

Tirupati laddu adulteration Inquiry: తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందా? సీబీఐ నేతృత్వంలో సిట్‌ దర్యాప్తు ఎంత వరకు వచ్చింది? ఇంతకీ ఏ డైయిరీలో కల్తీ జరిగింది? సుప్రీంకోర్టుకు సమర్పించిన ప్రాథమిక నివేదికలో ఏయే అంశాలున్నాయి? ఇవే ప్రశ్నలు ఇప్పుడు శ్రీవారి భక్తులను వెంటాడుతున్నాయి.

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వినియోగించినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు స్పీడ్‌గా జరుగుతోంది. సీబీఐ నేతృత్వంలోని సిట్‌ బృందం ప్రాథమిక నివేదికను సుప్రీంకోర్టు బెంచ్‌కు సమర్పించినట్లు సమాచారం. ఆన్‌లైన్‌లో ద్వారా రిపోర్టును అందజేసినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు, దర్యాప్తు వివరాలు అందులో పొందుపరిచినట్టు తెలుస్తోంది.

Advertisement

రిపోర్టు సమర్పించడానికి ముందు తిరుపతిలో మూడు రోజులు మకాం వేసింది సిట్ బృందం. నెయ్యి కల్తీ ఎక్కడ జరిగింది అనేదానిపై సమగ్రంగా నివేదించారట. సిట్ టీమ్‌లోని అధికారులు సర్వశ్రేష్ట త్రిపాఠీ, వీరేశ్ ప్రభు, మురళీ రాంబా, డాక్టర్ సత్యేన్ కుమార్‌లు శుక్రవారం తిరుపతిలోని సిట్ ఆఫీసుకు వచ్చారు.

దర్యాప్తు నివేదిక సమీక్షించిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీబీఐ డైరెక్టర్‌కు వివరాలు తెలిపారు. అంతకుముందు మధ్యాహ్నం తర్వాత టీటీడీ ఈవో శ్యామలరావును కలిసింది సిట్ టీమ్. దర్యాప్తుకు కావాల్సిన సమాచారానికి స్టేట్మెంట్ రూపంలో తీసుకుంది.

Advertisement

ALSO READ: బిగ్ టీవీ ఎఫెక్ట్.. టమాటా కథనంపై స్పందించిన ప్రభుత్వం.. ధరపై కీలక ప్రకటన

అందులో కీలకమైన ఏఆర్ డెయిరీ కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్టు ఎలా నిర్థారించారు? లడ్డూ నమూనాలు ఎన్డీడీబీకి పంపిన విషయం, ఆ తర్వాత నివేదికలోని అంశాలు తీసుకున్నారు. దీని తర్వాత మరొక ల్యాబ్ లో పరీక్షలు చేయించారా? లేదా వంటి సమాచారాన్ని టీటీడీ నుంచి తీసుకుంది. ముఖ్యంగా డెయిరీల నుంచి నెయ్యి కొనుగోలుకు సంబంధించి గతంలో ఎలాంటి ప్రమాణాలు పాటించారు? ప్రస్తుతం ఎలా ఉంది? మొత్తానికి ప్రాథమికంగా అయితే నివేదికను సిట్ ద్వారా సీబీఐ.. న్యాయస్థానానికి అందజేసింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×