// // Jagan Vs YV Subbareddy: సాయిరెడ్డి బాటలో సుబ్బారెడ్డి, జగన్‌తో వైవీకి ఎక్కడ చెడింది? -->
E-Paper
Advertisement

Jagan Vs YV Subbareddy: సాయిరెడ్డి బాటలో సుబ్బారెడ్డి, జగన్‌తో వైవీకి ఎక్కడ చెడింది?

Jagan Vs YV Subbareddy: సాయిరెడ్డి బాటలో సుబ్బారెడ్డి, జగన్‌తో వైవీకి ఎక్కడ చెడింది?
Advertisement

Jagan Vs YV Subbareddy: తిరుమల లడ్డూ వ్యవహారం వైసీపీని ఉక్కిరి బిక్కరి చేస్తోందా? ఈ విషయంలో నేతలు రెండుగా చీలిపోయారా? జగన్ మాటలు ఒకలా.. బాబాయి సుబ్బారెడ్డి మాటలు మరొకలా ఉన్నాయా? ఈ విషయంలో బాబాయి-అబ్బాయి మధ్య చెడిందా? పీపీపీ మాదిరిగా ఏపీలో ఒక మాట.. హస్తినలో మరొక మాట మాట్లాడుతున్నారా? అవుననే అంటున్నారు రాజకీయ నేతలు.

జగన్‌తో వైవీ సుబ్బారెడ్డికి ఎక్కడ చెడింది?

Advertisement

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం వైసీపీలో విభేదాలు మొదలైనట్టు తెలుస్తోంది. సీబీఐ సిట్ ఇచ్చిన నివేదికలో నెయ్యి కల్తీ జరిగిందని క్లియర్‌గా తేల్చింది. కెమికల్స్‌తో ఉపయోగించిన నెయ్యిని వినియోగించినట్టు పేర్కొంది. జంతువుల కొవ్వు లేదని అందులో ప్రస్తావించింది. ఈ విషయాన్ని పట్టుకుని మాజీ సీఎం జగన్, తిరుమల లడ్డూ విషయంలో ఎలాంటి కల్తీ జరగలేదని ప్రచారం మొదలుపెట్టారు.

దీనిపై తెలుగు మీడియాతో ఒకలా.. జాతీయ మీడియాతో ఒకలా ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. ఈ వ్యవహారంపై అంబటి రాంబాబు కుటుంబసభ్యులను పరామర్శించిన క్రమంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు అవాస్తవమని సీబీఐ సిట్ తేల్చిందన్నారు. ఏ తప్పూ చేయలేదు కాబట్టే సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని వ్యాఖ్యానించారు.

Advertisement

సాయిరెడ్డి బాటలో సుబ్బారెడ్డి?

ఈ వ్యవహారంపై నేషనల్ మీడియాతో మాట్లాడారు టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి.  సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చిందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి. తిరుమల లడ్డూ కల్తీ జరిగినట్టు అంగీకరించారు టీటీడీ మాజీ ఛైర్మన్. సీబీఐ సిట్ ఛార్జీషీటులో అదే మెన్షన్ చేసిందన్నారు.

నెయ్యిని సప్లై చేసినవారు అందులో ఉన్నారని చెప్పారు. ముఖ్యంగా అధికారులు, థర్డ్ పర్సన్స్, అందరి పేర్లు ప్రస్తావించిందన్నారు. ఈ వ్యవహారంలో జగన్ ఒకలా.. బాబాయి మరొకలా మాట్లాడడంపై ఆ పార్టీ నేతలు షాకయ్యారు. అబ్బాయి-బాబాయి ఎక్కడో చెడిందని చర్చించుకుంటున్నారు. జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తున్న కొందరు రాజకీయ నేతలు.. సాయిరెడ్డి మాదిరిగా వైవీని దూరం పెట్టే అవకాశముందని అంటున్నారు.

ALSO READ: జగన్‌ని డ్యామేజ్ చేస్తున్న కేడర్.. ఈసారి కొత్తగా ఆ రెండు

మెడికల్ కాలేజీ విషయంలోనూ వైసీపీ ఇలాంటి డ్రామాలే ఆడిందని అనుకుంటున్నారు. దీనిపై జాతీయస్థాయిలో మద్దతు ఇచ్చిన వైసీపీ, ఏపీకి వచ్చేసరికి తీవ్రంగా వ్యతిరేకిందని గుర్తు చేస్తున్నారు. ఈ లెక్కన జగన్ డబుల్ గేమ్ ఆడుతున్నారని అంటున్నారు. ఇలా రెండు పడవలపై కాలు పెడితే మొదటికి ముప్పు వస్తుందని అంటున్నారు. మొత్తానికి మెడికల్ కాలేజీ నిర్మాణాల విషయంలో పీపీపీల మాదిరిగానే, కల్తీ నెయ్యి విషయంలో వైసీపీ ఇరుక్కుపోయింది.

 

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×