E-Paper
Advertisement

Tirumala Theft: తిరుమల విగ్రహం చోరి కేసులో బిగ్ ట్విస్ట్.. విచారణలో షాకింగ్ నిజాలు!

Tirumala Theft: తిరుమల విగ్రహం చోరి కేసులో బిగ్ ట్విస్ట్.. విచారణలో షాకింగ్ నిజాలు!
Advertisement

Tirumala Theft: తిరుమలలో ఆంజనేయస్వామి విగ్రహం చోరీ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్‌కి తీసుకెల్లి విచారించగా అసలు విషయాలు బైట పడ్డాయి. పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.

మానసిక వేదన..

తిరుమల నడక మార్గంలో ఏడవమైలు వద్ద ఉన్న ఆంజనేయస్వామి విగ్రహాన్ని చోరీ చేసిన కేసును పోలీసులు చేదించారు. విశాఖపట్నంకు చెందిన నిందితుడు యశ్వంత్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని కోసం పోలీసులు 5 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టి అరెస్టు చేశారు. చోరీ చేసిన నిందితుడు బిటెక్ చదివాడు. ఉద్యోగం రాలేదని మానసిక వేదనతో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఆధ్యాత్మిక చింతనతో ఉన్నాడని, విజయనగరం జిల్లా గొర్లమండలం మఠంలో కొన్నిరోజుల పాటు ఉన్నాడని పోలీసులు తెలిపారు.

విశాఖపట్నం వెళుతుండగా..

Advertisement

ఏడవమైలులో విగ్రహం ముచ్చటగా ఉండడాన్ని చూశాడని, విగ్రహాన్ని ఇంటికి తీసుకెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. 21వ తేదీ ఉదయం జీపులో తిరుమల జిఎన్ సి నుంచి తిరుపతికి బయలుదేరాడని పోలీసులు తెలిపారు. పెద్ద ఆంజనేయస్వామి విగ్రహం వద్ద ఆగాలని జీపు డ్రైవరుకు చెప్పాడు. ఏడవమైలు వద్ద ఆపిందే చిన్న విగ్రహాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు. జీపు డ్రైవర్‌ను పోలీసులు విచారిస్తే నిందితుడి సమాచారం ఇచ్చాడని పోలీసులు తెలిపారు. నిందితుడు విశాఖపట్నం వెళుతుండగా పట్టుకున్నామని, సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు.

Also read: KTR: సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ నోటీస్..?

గోవిందమాల ధరించి..

Advertisement

జూలై 22 తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో 7వ మైలురాయి వద్ద ఉన్న ఆంజనేయస్వామి గుడిలోని విగ్రహం చోరీకి గురైంది. అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్, తిరుపతి పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. గోవిందమాల ధరించిన ఒక వ్యక్తి విగ్రహాన్ని తీసుకెళ్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. కేసు తీవ్రతను బట్టి పోలీసు యంత్రాంగం ఏకంగా 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టింది. సాంకేతిక ఆధారాలు, టవర్ లొకేషన్లు , రవాణా మార్గాలను జల్లెడ పడుతూ నిందితుడు ఎటు వైపు వెళ్తున్నాడో నిమిష నిమిషానికి ట్రాక్ చేసి పోలీసులు పట్టుకున్నారు.

Also Read: Gurukul Vacancies: గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి బ్రేక్.. బ్యాక్ డోర్‌లో అమ్మేస్తున్నారా?

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×