E-Paper
Advertisement

Tirumala News: తిరుమల శ్రీవారి హుండీలో పాత నోట్ల కట్టలు.. ఏకంగా రూ.400 కోట్లు

Tirumala News: తిరుమల శ్రీవారి హుండీలో పాత నోట్ల కట్టలు..  ఏకంగా  రూ.400 కోట్లు
Advertisement

Tirumala News: దేశంలో పాత నోట్లు ఇంకా చెలామణి అవుతున్నాయా? ఎక్కడో దగ్గర పాత నోట్లు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయా? ఇప్పుడు తిరుమల వేదికైందా? ఎందుకు శ్రీవారి హుండీలో పాత నోట్లు పదే పదే వస్తున్నాయి? ఈ విషయంలో కేంద్రం నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయా? అవుననే అంటున్నారు అధికారులు.

తిరుమల శ్రీవారి హుండీలో పాత నోట్ల కట్టలు

Advertisement

దేశంలో పాత నోట్లు రద్దయి దశాబ్దం పైగానే అవుతోంది. అయినప్పటికీ ఇప్పటికీ ఎక్కడో దగ్గర బయటపడుతూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ టెంపుల్ తిరుమల గురించి చెప్పనక్కర్లేదు. ప్రతీ రోజూ 50 నుంచి 70 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. అదే సమయంలో భక్తులు పాత నోట్లను స్వామికి సమర్పిస్తున్నారు.

గతంలో రద్దైన రూ.500, రూ.1,000 నోట్లను హుండీలో గుర్తించారు. వీటి మొత్తం దాదాపు రూ.400 కోట్ల వరకు ఉంటాయని ఓ అంచనా. ఇప్పటికీ కొందరు రెండు వేల నోట్లు హుండీలో కానుకలుగా సమర్పిస్తున్నారు భక్తులు. పెద్ద నోట్లను టీటీడీ మార్చుకుంటున్నా, వెయ్యి, ఐదువందల నోట్ల విషయంలో టీటీడీకి ఇబ్బంది తప్పలేదు.

Advertisement

ఏకంగా రూ.400 కోట్లు.. ఏం చెయ్యాలంటూ  తలలు పట్టుకుంటున్న సిబ్బంది

గతంలో రద్దైన నోట్లను మార్చుకునే అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసింది టీటీడీ.  ఈ విషయంలో టీటీడీ చైర్మన్లు, అధికారులు పలుమార్లు కేంద్రానికి వినతి పత్రాలు అందజేశారు. అందుకు ససేమిరా అన్నట్లు అధికారుల మాట. చిన్న నోట్ల సంగతి అలా ఉంచితే కొంతమంది భక్తులు ఇప్పటికీ రెండు వేల నోట్లను తిరుమల శ్రీవారి హుండీలో కానుకలుగా వేస్తున్నారు. ప్రతి నెలా రూ.2 వేల నోట్లను హుండీల్లో భక్తులు సమర్పిస్తున్నారు.

ఇప్పటికీ ప్రతి నెలా శ్రీవారి హుండీలో రూ.30 కోట్ల నుంచి రూ.35 కోట్లు వరకు పాత నోట్లు వస్తున్నాయి.  వీటిని మార్చుకునే అవకాశం ఉండడంతో ప్రతి రెండు నెలలకు ఒకసారి చెన్నై ఆర్బీఐ రీజినల్ ఆఫీస్‌లో వాటిని జమ చేస్తున్నారు. రద్దైన నోట్ల వ్యవహారం టీటీడీకి తలనొప్పిగా తయారైంది. ముఖ్యంగా రూ.500, రూ.1000 నోట్ల అంశం ఏం చెయ్యాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట అధికారులు.

ALSO READ: ఏపీపై వరుణుడి పంజా.. నిప్పుల కొలిమిలో పిడుగుల బీభత్సం.. 9 మంది మృతి!

2016 నవంబర్ 8న రూ.500, 1000 నోట్లను కేంద్ర రద్దు చేసింది. నల్లధనం బయటకు తీయడం, నకిలీ నోట్లను అరికట్టడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. పాత కరెన్సీ మార్చుకోవడానికి ప్రజలు సమయం ఇచ్చింది. కరెన్సీలో 86 శాతం రూ. 500, రూ. 1000 నోట్లు చలామణి ఉన్నాయి. వాటిని రద్దు చేయడంతో కొత్తగా రూ.500, రూ.2వేల నోటును తిరిగి తీసుకొచ్చింది.

మూడేళ్ల కిందట 2023 మే 19న రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుంది. ప్రజలు పెద్ద నోట్లను బ్యాంకుల్లో ఎక్స్చేంజ్ చేసుకున్నారు. కొందరు వ్యక్తుల వద్ద పాత నోట్లు ఉన్నాయి. వాటిని ఏం చెయ్యాలో తెలియక తిరుమల శ్రీవారి హుండీలో వేస్తున్నారు. భక్తుల ఇస్తున్న ఈ నోట్ల విషయంలో టీటీడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వెయిట్ అండ్ సీ?

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×